Connect with us

Technology

ఈ బ్యాంకు యాప్స్ లో డబ్బులు పంపిస్తున్నారా..! అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి..!

Published

on

భారతీయ బ్యాంకుల యాప్స్‌తో సహా 232 బ్యాంకింగ్‌ యాప్స్‌ను వాడితే ముంపు పొంచి ఉందని హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ రిపోర్టులు చెబుతున్నాయి. ‘ఆండ్రాయిడ్‌.బ్యాంకర్‌.ఏ9480’ అనే ట్రోజన్‌ మాల్‌వేర్‌ టార్గెట్‌ చేసిందని తెలిసింది. అయితే ఈ మాల్ వేర్ యూజర్ల లాగిన్‌ డేటా, ఎస్‌ఎంఎస్‌, కాంటాక్ట్‌ లిస్టులను హానికర సర్వర్‌లో అప్‌లోడ్‌ చేసినట్టు పేర్కొన్నాయి. అదనంగా బ్యాంకింగ్‌ యాప్స్‌తో పాటు, యూజర్ల ఫోన్లలో వాడే క్రిప్టోకరెన్సీ యాప్స్‌ను కూడా ఈ ట్రోజన్‌ టార్గెట్‌ చేసిందని తెలిపింది.

ఆండ్రాయిడ్‌ బ్యాంకింగ్‌ ట్రోజన్‌ మాల్‌వేర్‌ టార్గెట్‌ చేసిన దేశీయ బ్యాంకింగ్‌ యాప్స్‌ జాబితాను కూడా క్విక్‌ హీల్‌ విడుదల చేసింది. వాటిలో యాక్సిస్‌ మొబైల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొబైల్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ ఎనీవేర్ పర్సనల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొబైల్‌బ్యాంకింగ్‌ లైఫ్‌, ఐసీఐసీఐ బ్యాంకు ఐమొబైల్‌, ఐడీబీఐ బ్యాంకు గో మొబైల్‌+, ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌కు చెందిన అభయ్‌, ఐడీబీఐ బ్యాంకు గో మొబైల్‌, ఐడీబీఐ బ్యాంకు ఎంపాస్‌బుక్‌, బరోడా ఎంపాస్‌బుక్‌, యూనియన్‌ బ్యాంకు మొబైల్‌ బ్యాంకింగ్‌, యూనియన్‌ బ్యాంకు కమర్షియల్‌ క్లయింట్స్‌ ఉన్నాయి. ఈ బ్యాంకింగ్‌ యాప్స్‌ వాడుతున్న కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

థర్డ్‌పార్టీ స్టోర్ల ఫేక్‌ ఫ్లాష్‌ ప్లేయర్‌ ద్వారా ఆండ్రాయిడ్‌.బ్యాంకర్‌.ఏ9480 మాల్‌వేర్‌ విజృంభిస్తుందని క్విక్‌ హీల్‌ రిపోర్టు చేసింది. సైబర్‌క్రిమినల్స్‌కు ఫ్లాష్‌ ప్లేయర్‌ యాప్‌ చాలా పాపులర్‌ టార్గెట్‌. ఒక్కసారి యూజర్లు ఈ హానికర అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేస్తే, కనిపించని ఐకాన్‌ యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చేస్తుంది. అది టార్గెట్‌ చేసిన 232 బ్యాంకింగ్‌ యాప్స్‌కు సంబంధించి ఏ ఒక్క యాప్‌ను యూజర్లు చెక్‌ చేసుకున్నా.. ఆ హానికర యాప్‌ బ్యాంక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ యూజర్ల డేటాను దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కీలక డేటాను దొంగలిస్తుందని క్విక్‌ హీల్‌ రిపోర్టు చేసింది.

Technology

టీ20 సిక్సర్ల వీరుల్లో రోహిత్ శర్మనే టాప్

Published

on

కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఎట్టకేలకి ఫామ్‌ అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (89: 61 బంతుల్లో 5×4, 5×6) అర్ధశతకం బాదడంతో 17 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు టోర్నీ ఫైనల్‌కి చేరింది.

భారత్ తరఫున ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా యువరాజ్ సింగ్ 74 సిక్సర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.రీసెంట్ గా రోహిత్ శర్మ 75 సిక్సర్లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా (54 సిక్సర్లు), మహేంద్రసింగ్ ధోని (46), విరాట్ కోహ్లి (41) టాప్-5లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి లీగ్ దశ చివరి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ జట్టు ఫైనల్ ఆడనుంది.

Continue Reading

Technology

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

Published

on

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం కేంబ్రిడ్జిలోని అయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సరిగ్గా గెలీలియో మరణించిన 300 ఏళ్ల తర్వాత.. 1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లాండ్‌లో జన్మించారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన అనేక పరిశోధనలు చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. వ్యాధి కారణంగా క్రమంగా పక్షవాతానికి గురైన ఆయన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. కదల్లేని స్థితిలోనూ విశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే చాలా పరిశోధనలు చేశారు.

దశాబ్దాలుగా కంప్యూటర్ సహాయంతోనే హ్యాకింగ్ సైగలను మాటలుగా మార్చి అర్థం చేసుకుంటున్నారు. శరీరం సహకరించని స్థితిలోనూ కృష్ణ బిలాలపై ఆయన చేసి పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా ఆయన సేవలందించారు.

1970 నుంచి హ్యాకింగ్ కృష్ణబిలాలపై పరిశోధనలు స్టార్ట్ చేసాడు. వ్యాధి ముప్పు వల్ల శరీరం రోజు రోజుకూ క్షీణిస్తున్నా.. అవిశ్రాంతంగా పరిశోధనలు జరిపి కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫై టైమ్’ అనే పుస్తక రచన మొదలుపెట్టారు. ఆ టైమ్ లోనే వ్యాధి కారణంగా మరుసటి ఏడాది వైద్య చికిత్స తీసుకున్నారు.

అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ రూపొందించుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో వెలువడింది. ‘కాలం కథ’ పేరుతో తెలుగులోనూ ఈ పుసక్తాన్ని తీసుకొచ్చారు.

Continue Reading

Political News

ఫస్ట్ టెస్టులో సచిన్ సహయం.. మర్చిపోలేని గంగూలీ

Published

on

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చాలా ఏళ్లపాటు కలిసి క్రికెట్ ఆడారు. వీరిద్దరూ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. చాలా ఏళ్లపాటు ఓపెనర్లుగా వీరిద్దరూ ఎన్నో అద్భుత భాగస్వామ్యాలను నెలకొల్పారు. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్న దాదా.. సచిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. గంగూలీ 1996లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా లాంగ్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు.

ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన దాదా.. ఆ ఘనత సాధించిన అతి కొద్ది మంది భారత క్రికెటర్ల సరసన నిలిచాడు. లార్డ్స్ టెస్టులో గంగూలీ శతకం సాధించిన వెంటనే 15 నిమిషాలపాటు టీ బ్రేక్ ఇచ్చారు. దాదా టీ తాగుదాం అనుకుంటుండగానే.. బ్యాట్‌ హ్యాండిల్ దగ్గర పగుళ్లు ఏర్పడటం చూసాడు.

దీంతో టేప్ అందుకుని బ్యాట్‌కు చుడుతుండగా.. సచిన్ గంగూలీ దగ్గరకు వచ్చాడట. నువ్వు టీ తాగుతూ బ్రేక్ తీసుకో. తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేయాలి కదా.. ఆ పని నేను చేస్తాలే అని చెప్పి దాదా బ్యాట్‌కు టేప్ చుట్టాడట.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: