Connect with us

Movie News

హీరోగా విఘ్నేశ్ శివన్ హీరోయిన్‌గా నయనతార కొత్త మూవీ ప్రారంభం

Published

on

దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ప్రేమలో వున్నారనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ప్రస్తుతం ఫారిన్ ట్రిప్పులతో బిజీ బిజీగా వున్నారు.

ఈ నేపథ్యంలో విఘ్నేశ్ ఓ కొత్తను రెడీ చేసుకుని.. అందులో హీరోయిన్ రోల్ కోసం నయనతారను ఎంపిక చేసుకునేందుకు రంగం సిద్ధంచేసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో హీరో క్యారక్టర్ కోసం విఘ్నేష్ మల్లగుల్లాలు పడుతుంటే.. హీరోగా ఎవరో ఎందుకు.. ఆ క్యారక్టర్ నువ్వే చేసేయ్ అని నయనతార అందట. అంతేగాకుండా నయనతారను హీరోయిన్‌గా తీసుకునేందుకు ఎవరు సంప్రదించినా హీరోగా విఘ్నేశ్‌ను తీసుకోవాలని కొత్తగా షరతు పెడుతుందట.

ఇదిలా ఉంటే.. విశ్వాసం అనే టైటిల్‌తో అజిత్ రీసెంట్ మూవీ తెర‌కెక్క‌ుతోంది. వీరం, వేదాళం, వివేగం మూవీల‌ ద‌ర్శ‌కుడు శివ‌ ఈ మూవీకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. మూవీలో అజిత్ ఓ డాన్‌గా క‌నిపించ‌నుండ‌గా, మొదటిసారి ఈ మూవీ కోసం చెన్నై త‌మిళ స్లాంగ్‌లో అజిత్ డైలాగులు చెప్తాడని స‌మాచారం. విశ్వాసం మూవీలో అజిత్ స‌ర‌స‌న లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించ‌నుంది.

గ‌తంలో అజిత్‌తో క‌లిసి మొదటిసారిగా ఏగన్ అనే మూవీ చేసింది న‌య‌న‌తార. ఆ త‌ర్వాత‌ బిల్లా, ఆరంభం అనే మూవీలోను క‌లిసి యాక్ట్ చేసారు. ప్రస్తుతం విశ్వాసం చిత్రంతో అజిత్, నయనతార నాలుగో సారి జ‌త‌క‌డుతున్నారు. ఈ మూవీ కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేసి.. అజిత్‌, న‌య‌న్‌ల‌పై ఓ రొమాంటిక్ సాంగ్ తీస్తున్నట్లు తెలుస్తోంది.

Latest News

Trending

%d bloggers like this: