Connect with us

Movie News

ఎన్టీఆర్ బయోపిక్‌ మూవీలో బాలీవుడ్ బ్యూటీ?

Published

on

ఎన్టీఆర్ బయోపిక్‌పై రోజుకో న్యూస్ హల్చల్ చేస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకొని ప్రాజెక్ట్‌ నెలాఖరుకు సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే డైరెక్టర్ తేజ స్టోరీ లైన్‌కు తగ్గట్లు క్యారెక్టర్ల ఎంపికపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మూవీకి ముఖ్యమైన ఎన్టీఆర్ భార్య బసవతారకం క్యారక్టర్ కి సంబంధించి ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్‌ అయితే కథకు క్యారక్టర్ కి తగ్గట్లు సరిపోతుందని తేజ భావించారట. అందుకే ఆమెను సంప్రదించినట్లు సమాచారం.

అయితే ఆమె ఓకే చెప్పిందా లేదా అన్నది క్లారిటీ రాలేదు. దీనిపై మూవీ యూనిట్ నుంచి కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ క్యారక్టర్‌లో శర్వానంద్ నటిస్తారని వార్తలొచ్చాయి. మళ్లీ ఇప్పుడు విద్యాబాలన్‌‌ను కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Latest News

Trending

%d bloggers like this: