Connect with us

Technology

TEZ యూప్ లో ఒక చిన్న ట్రిక్ ని వాడితే BETTER LUCK NEXT TIME అని రాకుండా చెయ్యొచ్చు

Published

on

Tez Google

ఇప్పుడున్న ఇంటర్ నెట్ ప్రపంచంలో మొత్తం ఆప్ రూపంలో మొత్తం సమాచారాన్నిఅందిస్తున్నారు, ఇంట్లో కూర్చుని మరి బయట ప్రపంచం ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. మోబైల్ అంటే యువతకు చాలా క్రేజ్. ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి వచ్చే కొత్త కొత్త ఫోన్స్ ని కొనేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.యాప్స్ పై కూడా చాలా క్రేజ్ పెరిగింది. రకరకాల యాప్స్ మార్కెట్లోకి వస్తున్నాయి వాటితో టైమ్ పాస్ తో పాటు.డబ్బులు కూడా సంపాదించవచ్చు అని తెలియటంతో యాప్స్ వెంట పరుగులు పెడుతున్నారు యువత. అయితే ఆ యాప్స్ ని ఎలా వాడాలో తెలియక సతమత అవుతున్నారు.

అయితే ఇపుడు తేజ్ యాప్ ట్రెండింగ్ అవుతుంది. ఎక్కడ చూసినా.. ఎవరు చూసిన తేజ్ యాప్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే  తేజ్ యాప్ నుండి ట్రాన్స్ ఫర్ చేసుకుంటే.. అందులో నుండి మనకి బోనస్ వస్తుంది.. అయితే.. ఇందులో చిన్న లిటికేషన్ ఉంది. ఈ యాప్ ద్వారా మనీ సెండ్ చేస్తే. బోనస్ వస్తుందని అనుకున్న చాలా మందికి BETTER LUCK NEXT TIME పేరుతో నిరాశ కలుగుతుంది .అలాంటప్పుడు ఒక ట్రిక్ ని ఉపయోగిస్తే చాలు.

1.మీరు మనీ సెండ్ చేయాలి అనుకుంటే.. డైరెక్ట్ గా కాంటాక్ట్ నెంబర్ ని సెలక్ట్ చేసి మనీ సెండ్ చెయ్యొద్దు… కింద ఆపర్స్ అనే option ఉంటుంది. దానికి క్లిక్ చేసి అక్కడి నుండి మనీ సెండ్ చేయాలి .ఇలా పంపిస్తే.. దాదాపుగా 99 శాతం better luck అనేది రాదు.

2.తేజ్ యాప్ ఆఫర్స్ ఇస్తున్నాడంటే దాని అర్ధం.. అది పాపులర్ కావాలనే కదా.. సో కొత్త వారికి పంపిస్తే.. 99 శాతం scratch కార్డు వస్తుంది. పంపించిన వాళ్లకే మళ్లీ సెండ్ చేస్తే డబ్బులు రావు.

3.డబ్బులు సెండ్ చేసేటప్పుడు మనీ కింద ఏదో ఒకటి రాయాలని option వస్తుంది. అక్కడ ఏది పడితే అది రాయకుండా.. అక్కడ scratch కార్డు రాస్తే దాదాపుగా బెటర్ లక్ నెక్ట్స్ టైం అని రాయాలి.

4.ఎప్పుడు కూడా మీ దగ్గరున్న scratch కార్డులు అన్నీ ఒకసారి చేయకూడదు. రోజూకి  ఒకటి కానీ.. డే బై డే కానీ చేయాలి.

Technology

టీ20 సిక్సర్ల వీరుల్లో రోహిత్ శర్మనే టాప్

Published

on

కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఎట్టకేలకి ఫామ్‌ అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (89: 61 బంతుల్లో 5×4, 5×6) అర్ధశతకం బాదడంతో 17 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు టోర్నీ ఫైనల్‌కి చేరింది.

భారత్ తరఫున ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా యువరాజ్ సింగ్ 74 సిక్సర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.రీసెంట్ గా రోహిత్ శర్మ 75 సిక్సర్లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా (54 సిక్సర్లు), మహేంద్రసింగ్ ధోని (46), విరాట్ కోహ్లి (41) టాప్-5లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి లీగ్ దశ చివరి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ జట్టు ఫైనల్ ఆడనుంది.

Continue Reading

Technology

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

Published

on

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం కేంబ్రిడ్జిలోని అయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సరిగ్గా గెలీలియో మరణించిన 300 ఏళ్ల తర్వాత.. 1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లాండ్‌లో జన్మించారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన అనేక పరిశోధనలు చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. వ్యాధి కారణంగా క్రమంగా పక్షవాతానికి గురైన ఆయన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. కదల్లేని స్థితిలోనూ విశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే చాలా పరిశోధనలు చేశారు.

దశాబ్దాలుగా కంప్యూటర్ సహాయంతోనే హ్యాకింగ్ సైగలను మాటలుగా మార్చి అర్థం చేసుకుంటున్నారు. శరీరం సహకరించని స్థితిలోనూ కృష్ణ బిలాలపై ఆయన చేసి పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా ఆయన సేవలందించారు.

1970 నుంచి హ్యాకింగ్ కృష్ణబిలాలపై పరిశోధనలు స్టార్ట్ చేసాడు. వ్యాధి ముప్పు వల్ల శరీరం రోజు రోజుకూ క్షీణిస్తున్నా.. అవిశ్రాంతంగా పరిశోధనలు జరిపి కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫై టైమ్’ అనే పుస్తక రచన మొదలుపెట్టారు. ఆ టైమ్ లోనే వ్యాధి కారణంగా మరుసటి ఏడాది వైద్య చికిత్స తీసుకున్నారు.

అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ రూపొందించుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో వెలువడింది. ‘కాలం కథ’ పేరుతో తెలుగులోనూ ఈ పుసక్తాన్ని తీసుకొచ్చారు.

Continue Reading

Political News

ఫస్ట్ టెస్టులో సచిన్ సహయం.. మర్చిపోలేని గంగూలీ

Published

on

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చాలా ఏళ్లపాటు కలిసి క్రికెట్ ఆడారు. వీరిద్దరూ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. చాలా ఏళ్లపాటు ఓపెనర్లుగా వీరిద్దరూ ఎన్నో అద్భుత భాగస్వామ్యాలను నెలకొల్పారు. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్న దాదా.. సచిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. గంగూలీ 1996లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా లాంగ్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు.

ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన దాదా.. ఆ ఘనత సాధించిన అతి కొద్ది మంది భారత క్రికెటర్ల సరసన నిలిచాడు. లార్డ్స్ టెస్టులో గంగూలీ శతకం సాధించిన వెంటనే 15 నిమిషాలపాటు టీ బ్రేక్ ఇచ్చారు. దాదా టీ తాగుదాం అనుకుంటుండగానే.. బ్యాట్‌ హ్యాండిల్ దగ్గర పగుళ్లు ఏర్పడటం చూసాడు.

దీంతో టేప్ అందుకుని బ్యాట్‌కు చుడుతుండగా.. సచిన్ గంగూలీ దగ్గరకు వచ్చాడట. నువ్వు టీ తాగుతూ బ్రేక్ తీసుకో. తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేయాలి కదా.. ఆ పని నేను చేస్తాలే అని చెప్పి దాదా బ్యాట్‌కు టేప్ చుట్టాడట.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: