Connect with us

Technology

ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాలు ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందో చుడండి..!

Published

on

కెనడాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. టొరంటో విమానాశ్రయంలోనే ఈ ఘటన జరిగింది. దట్టమైన మంచుతో వణికిపోతున్న ప్రయాణికులకు.. విమానాలు ఢీకొన్న ఘటన మరింత భయభ్రాంతులకు గురిచేసింది. విమానశ్రయంలోని రన్‌వే వద్ద టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న రెండు విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. దింతో వెనకభాగం నుంచి దట్టమైన పొగతో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదం కెనడాలోని టొరంటో పియర్సన్ విమానశ్రయంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అప్రమత్తమైన వైమానిక భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి విమానంలోని అత్యవసర మార్గాల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్‌పోర్టు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఢీకొన్న రెండు విమానాలను వెస్ట్ జెట్ 2425 విమానం, సన్‌వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానంగా అధికారులు గుర్తించారు.

ఈ రెండు విమాన సంస్థలు ప్ర‌మాదానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న జారీ చేశాయి. ప్రమాద సమయంలో వెస్ట్ జెట్ విమానంలో 168 ప్రయాణికులు ఉండగా, వారితో పాటు మరో ఆరుగురు వైమానిక సిబ్బంది కూడా ఉన్నారు. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న సమయంలో రన్ వే వద్ద సన్‌వింగ్ విమానం బయల్దేరుతుండగా దాని వెనక వెస్ట్ జెట్ విమానం బయల్దేరేందుకు రెడీగా ఉంది. ఈ క్రమంలో రెండు విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: