Connect with us

Health

ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా అయితే మీ కిడ్నీలు డేంజర్ లో ఉన్నాయి

Published

on

మన శరీరంలో కిడ్నీలు ఎంత ముఖ్యపాత్ర పోషిస్తాయో అందరికీ తెలిసిందే. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వాటిల్లో ఉండే మలినాలను తొలగిస్తాయి. శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. మూత్రం రూపంలో వ్యర్థాలను తొలగిస్తాయి. ఈ క్రమంలో కిడ్నీలు పనిచేయకపోతే మన శరీరం మనకు పలు అనారోగ్య సమస్యలను, లక్షణాలను చూపిస్తుంది. వాటిని సరైన సమయంలో గమనిస్తే కిడ్నీలు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మరి కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదు అనేందుకు మన శరీరంలో కనిపించే ఆ లక్షణాలు ఏంటో చూడండి.

1. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లవు. దీంతో విష పదార్థాలు శరీరంలోనే ఉండిపోతాయి. దాని వలన మనకు నిద్ర పట్టదు. ఎవరైనా నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటుంటే ఎందుకైనా మంచిది కిడ్నీలను పరీక్ష చేయించుకోవాలి.

2. కిడ్నీలు బాగా పనిచేస్తే మన శరీరంలో విటమిన్‌ డి ని అవి ఎముకల కోసం వినియోగిస్తాయి. అలా పనిచేయకపోతే ఈపీవో అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. దీంతో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతాయి. వాటి ద్వారా రక్తం కూడా సరిగ్గా అందదు. ఈ క్రమంలో తలనొప్పి వస్తుంది. పనిచేసినా, చేయకపోయినా అలసటగా ఉంటుంది.

3. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో వ్యర్ధ ద్రవాలు అలాగే ఉండిపోతాయి. అవి చర్మం కిందకు చేరి దురదను కలిగిస్తాయి. దీంతోపాటు చర్మం పొడిగా కూడా ఉంటుంది.

4. కిడ్నీల పనితీరు మందగిస్తే నోరు దుర్వాసన వస్తుంది. నాలుక లోహపు రుచిలో ఉంటుంది.

5. కిడ్నీలు బాగా పనిచేయకపోతే శ్వాస సరిగ్గా ఆడదు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది.

6. మడమలు, కాళ్లు, చేతుల్లో ద్రవాలు, నీరు బాగా పేరుకుపోయి అవి వాపులకు, నొప్పులకు లోనైతే కిడ్నీలు చెడిపోయాయని అర్థం చేసుకోవాలి. ఇలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్‌ను కలవాలి.

7. కిడ్నీలు చెడిపోతే ఎప్పుడూ బ్యాక్‌ పెయిన్‌ వస్తుంటుంది. కిడ్నీలు ఉన్న స్థానంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. వంగినా, కూర్చున్నా ఆ ప్రదేశంలో నొప్పిగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నా కిడ్నీలు బాగా లేవని అర్ధం.

8. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మూత్రం ద్వారా ప్రోటీన్‌ పోతుంది. ఇలా జరిగితే కళ్లు వాపులకు లోనై, ఉబ్బి కనిపిస్తాయి. ఇలాంటి లక్షణం ఉంటే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిన్నదని తెలుసుకోవాలి.

9. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే కనిపించే మరో లక్షణం హై బీపీ. హై బీపీ సమస్య ఉన్నా దాన్ని కిడ్నీ వ్యాధిగా అనుమానించి టెస్ట్‌ చేయించుకోవాలి.

10. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే వచ్చే మూత్రం దుర్వాసనతో ఉంటుంది. దీనికి తోడు మూత్రం ఎక్కువగా వస్తుంది. రోజుకు 4 నుంచి 10 సార్లు మూత్ర విసర్జన చేయడం సహజమే. ఇంతకన్నా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తుంటే దాన్ని కిడ్నీ వ్యాధిగా అనుమానించాలి.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Health

సబ్జా గింజలు.. చలవే కాదు ఎంతో ఆరోగ్యం

Published

on

వేసవి కాలం వచ్చేసింది. బయటికెళ్లి వస్తే చాలు మాడు మాడిపోతుంది. ఒంట్లో వేడి పెరిగిపోతుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక మనం చాలా పానీయాలు తాగేస్తుంటాం. సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్లు, షరబత్లు ఇలా రోడ్డు మీద కనబడే ప్రతీది తాగాలనిపిస్తుంది. కానీ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఇంటి దగ్గరే మనకు మంచి పానీయం ఉంది. అదే సబ్జా గింజల పానీయం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలా మంది దాన్ని మర్చిపోయారు. కానీ ఈ వేసవిలో మన ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా గింజలు చాలా మంచివి.

ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి. సబ్జా గింజల పానీయం ఎలా చేయాలి, దాని వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.

పానీయం తయారీ:

సబ్జా గింజలను నీళ్లతో కడిగి వాటిని శుభ్రంచేసి ఓ కప్పులో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. నీటిలో నానిన నల్లని గింజలు కాస్త జెల్లీలా మారిపోతాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలను నిమ్మకాయ నీటిలో కలుపుకుని తాగొచ్చు, లేదంటే పంచదార కలిపిన నీటిలో వేసుకుని తీసుకోవచ్చు.

మలబద్ధానికి చెక్:

సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.

Continue Reading

Health

పెరుగుతో గుండె జబ్బులకు చెక్

Published

on

మీరు అధిక రక్తపోటు (హైబీపీ)తో బాధపడుతున్నారా అయితే ఆహారంలో రోజూ పెరుగు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే పెరుగును ఆహారంలో భాగంగా చేసుకుంటే దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెరుగుతోపాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడొచ్చని వారు అంటున్నారు.

ఒక అధ్యయనం ప్రకారం అధిక రక్తపోటుతో బాధపడుతున్న 30 – 55 మధ్య వయసున్న 55వేల మంది మహిళలు, 40-75 మధ్య వయసున్న 18వేల మంది పురుషులపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వారంపాటు.. రోజూ 60 మి.లీ పరిమాణంలో పెరుగు తినమని సూచించారు. వారం తర్వాత వీరిపై మళ్లీ పరిశోధనలు చేయగా… శాస్త్రవేత్తలకు సరికొత్త విషయాలు తెలిశాయి. పెరుగు తీసుకున్నవారిలో చాలా మందికి.. గుండె జబ్బులు వచ్చే అవకాశం 30 శాతం వరకు తగ్గినట్లు గ్రహించారు. మిగతావారిలోనూ ఈ అవకాశం చాలావరకు తగ్గినట్లు అధ్యయనంలో తేలింది.

Continue Reading

Health

జామపండుతో జలుబుకు చెక్

Published

on

జలుబు మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తోందా..? అయితే జామ పండు తినండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. జలుబుతో బాధపడేవారు జామ పండు తినొద్దని చాలామంది చెబుతుంటారు, కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే జామలో జలుబును తగ్గించే లక్షణాలున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. తీవ్రమైన జలుబుతో బాధపడేవారు పెద్దసైజు జామకాయను తీసుకుని అందులో గింజలు తీసేసి తినాలి. తర్వాత గ్లాసు నీళ్లు తాగితే అది మందులా పనిచేసి గొంతులోనూ, ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తగ్గిస్తోంది. దీంతో జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఒక్క జలుబె కాదు. ఇతర ఆరోగ్య సమస్యలకూ జామ మంచి పరిష్కారంగా పనిచేస్తోంది:

* జామ నుంచి లభించే పీచు షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా పనిచేస్తుంది. వీరు జామకాయను నిరభ్యంతరంగా తినవచ్చు.

* జామకాయలో ఉండే బి3, బి6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

* తలనొప్పి, మైగ్రేన్ ప్రాబ్లమ్ తో బాధపడేవాళ్లు పచ్చిజామకాయను ముద్దలా నూరి, రోజులో మూడునాలుగుసార్లు నుదుటిమీద పెట్టుకుంటే పెయిన్ తగ్గుతుంది.

* గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు గింజలు తీసిన జామకాయ ముక్కలకు పంచదార కలిపి, వాటిని మెత్తగా ఉడికించి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. దీంతో గుండె పనితీరు మెరుగుపడుతోంది.

* ఆర్థరైటిస్‌ సమస్యతో బాధపడేవారు జామ ఆకులను ముద్దగా నూరి నొప్పి ఉన్నచోట పెడితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

* జామను ఎక్కువగా తినేవారి చర్మం ఎలాంటి మచ్చలు, ముడుతలు లేకుండా మెరుస్తూ ఉంటుంది. వృద్ధాప్య‌ చాయలను దూరం చేస్తోంది.

* జామలో ఉంటే కాపర్, థైరాయిడ్ సమస్యలకు మంచి పరిష్కారం ఉంటుంది.

* జామ ఆకు రసాన్ని వెన్నెముక మీద రాస్తే మూర్ఛవ్యాధి సమస్య ఉన్నవారు ఉపశమనం పొందుతారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: