Connect with us

Movie News

సూపర్ టాక్ వస్తున్న సూర్య గ్యాంగ్ మూవీ

Published

on

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ సంక్రాంతికి ఆయన కూడా రేసులోకి వచ్చాడు. బాలయ్య ‘జైసింహా’కు పోటీ తన ‘గ్యాంగ్’ను దించాడు. తమిళంలో తెరకెక్కిన ‘తానా సేంద కూట్టం’ సినిమాను ‘గ్యాంగ్’ పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్.
ఈ సినిమా నేడు (జనవరి 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళనాడులో ఇప్పటికే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చేసింది. ఇక ఇటు తెలుగులోనూ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సీబీఐ ఆఫీసర్‌గా సూర్య అద్భుత నటన కనబరిచాడట. ఇక కీర్తి సురేష్ రిపోర్టర్‌గా ఆకట్టుకుందని టాక్.

తమిళనాడులో 80 నుంచి 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయడం ఖాయమని అంటున్నారు. తెలుగులో సంక్రాంతి కానుకగా మొత్తం నాలుగు సినిమాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ విడుదలై డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది. ఇక ఈరోజు (జనవరి 12న) ‘జైసింహా’గా బాలయ్య వచ్చాడు. ఈ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. వీటికి పోటీగా డబ్బింగ్ సినిమాతో సూర్య వచ్చాడు. కానీ సినిమా బాగుంటే మాత్రం అది డబ్బింగా, డైరెక్ట్ తెలుగు చిత్రమా అని మన ప్రేక్షకులు ఆలోచించరు. బాలయ్య మాస్ స్టామినా ముందు సూర్య నిలబడతాడో లేదో చూడాలి మరి.

 

ఇదిలా ఉంటే ఈ మూడు పెద్ద సినిమాల మధ్య ‘రంగుల రాట్నం’ అనే చిన్న సినిమా వస్తోంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించారు. రాజ్ తరుణ్, చిత్రా శుక్ల జంటగా నటించారు. శ్రీ రంజని దర్శకత్వం వహించారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిన్న సినిమా.పెద్ద చిత్రాలన్నిటినీ వెనక్కి నెట్టి సంక్రాంతి హిట్టు చిత్రంగా నిలుస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతానికి అయితే సూర్య ‘గ్యాంగ్’ అయితే పాజిటివ్ టాకే వినిపిస్తోంది. సినిమా ఏమాత్రం బాగున్నా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సూర్య కోసం సినిమాకు వెళ్తారు

.

Movie News

hi

Published

on

hi

Continue Reading

Movie News

ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ నిశ్చితార్థం

Published

on

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లడం ఆ తరువాత ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ఆ తరువాత అఖిల్ తన దృష్టిని మూవీస్ పై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం ఆదివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

అనిందిత్ రెడ్డి ఎవరంటే..? అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని పెళ్లిచేసుకోనున్నాడన్నమాట.

దేశ వ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

 

Continue Reading

Movie News

రానాకు మరో బాహుబలి.. భారత్‌లో భారీ స్థాయిలో

Published

on

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. కనీవిని ఎరగని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘బ్లాక్ పాంథర్‌‌’ను దాటేసింది . మన దేశంలోనూ ఈ మూవీ 2000కు పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ మూవీ.. భారత్‌లో ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీగా నిలవనుంది.

ఈ హాలీవుడ్‌ మూవీలో సూపర్‌ హీరోలందరూ యాక్ట్ చేసారు. థానోస్ అనే సూపర్ విలన్ బారి నుంచి డజను మందికిపైగా హీరోలు కలిసి భూమిని కాపాడటమే ఈ మూవీ కథ. విలన్ థావోస్ క్యారక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. భారత మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాగా.. ఈ ఏడాది అంతకు ఒక్క రోజు ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది.

హాలీవుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో హైప్ వచ్చిన రెండో మూవీగా అవేంజర్స్ నిలిచింది. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ మూవీకి మాత్రమే అవేంజర్స్ కంటే ఎక్కువగా హైప్ వచ్చింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీల్లో ఇన్ఫినిటీ వార్‌ విడుదలవుతోంది.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ అమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్లు రాబట్టొచ్చని అంచనా. ఆంటోనీ రూస్సో, జో రూస్సో ఈ మూవీకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జెర్మీ రెన్నెర్, శామ్యూల్ జాక్సన్, విన్ డీజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: