Connect with us

Movie News

నేను కూడా అన్న ఎన్టీఆర్‌లా చేస్తా : రజినీకాంత్

Published

on

తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 8 నెలల్లోనే అధికారాన్ని సొంతం చేసుకున్న నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన తెదేపాను 29 మార్చి 1982న స్థాపించి 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అలాంటి చరిత్రనే సృష్టిస్తానంటున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. తమిళనాడులో ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చినా పోటీ చేయడానికి నేను సిద్దమే అని అంటున్నారు. కమల‌్ హాసన్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. కొందరు వేసిన ప్రశ్నలకు సమాధానం చెపుతూ. తన ఎన్నికల వ్యూహం ఎలా వుంటుందో చెప్పబోననీ అన్నారు. రాజకీయాల్లో కమల్ హాసన్‌తో కలిసి పనిచేస్తానో లేదో కాలమే చెబుతుంది అని చెప్పారు.

ఇకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. గత కొన్నిరోజులకు ముందే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన రజనీకాంత్‌కు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. తన పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి. ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఇప్పటికే రజనీకాంత్ ఉన్నారు. అయితే తాను చేస్తున్న రెండు సినిమాలు చివరి దశకు చేరుకోవడంతో ప్రస్తుతానికి వాటిని పూర్తి చేయాలనీ అనుకుంటున్నారు.

గత వారంరోజులుగా రజనీకాంత్ తమిళనాడు ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసినా సీఎం అయ్యే అవకాశమే లేదని ప్రచారం జరుగుతోంది. కేవలం 33 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే రజనీ గెలుచుకోగలడని, అన్నాడిఎంకే, డిఎంకే పార్టీలకు గతంలోలానే సీట్లు వచ్చే అవకాశం ఉందని, అయితే డీఎంకేకే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఒక సర్వేలో తెలిసింది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా డీఎంకేకి 133 సీట్లు రావడం ఖాయమని, అన్నాడిఎంకే మాత్రం ఘోరంగా ఓడిపోవడం ఖాయమని, దాంతో పాటు రజనీకాంత్‌కు 25 నుంచి 30 సీట్లు మాత్రమే రావచ్చని సర్వేలో తెలిసింది. ఈ సర్వేతో రజనీ అభిమానులు ఢీలా పడిపోతున్నారు. అయితే సర్వేలను పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదంటూ కొంతమంది రజనీకాంత్ అభిమాన సంఘం నేతలు చెబుతుంటే మరికొందరు మాత్రం సర్వేలను కొట్టి పారేయకూడదంటున్నారు. రజనీకాంత్ నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తులకు సీట్లిస్తే ఖచ్చితంగా తమిళ ప్రజలు ఆదరిస్తారని, అప్పుడు ఖచ్చితంగా రజనీకాంత్ సీఎం అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Movie News

hi

Published

on

hi

Continue Reading

Movie News

ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ నిశ్చితార్థం

Published

on

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లడం ఆ తరువాత ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ఆ తరువాత అఖిల్ తన దృష్టిని మూవీస్ పై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం ఆదివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

అనిందిత్ రెడ్డి ఎవరంటే..? అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని పెళ్లిచేసుకోనున్నాడన్నమాట.

దేశ వ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

 

Continue Reading

Movie News

రానాకు మరో బాహుబలి.. భారత్‌లో భారీ స్థాయిలో

Published

on

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. కనీవిని ఎరగని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘బ్లాక్ పాంథర్‌‌’ను దాటేసింది . మన దేశంలోనూ ఈ మూవీ 2000కు పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ మూవీ.. భారత్‌లో ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీగా నిలవనుంది.

ఈ హాలీవుడ్‌ మూవీలో సూపర్‌ హీరోలందరూ యాక్ట్ చేసారు. థానోస్ అనే సూపర్ విలన్ బారి నుంచి డజను మందికిపైగా హీరోలు కలిసి భూమిని కాపాడటమే ఈ మూవీ కథ. విలన్ థావోస్ క్యారక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. భారత మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాగా.. ఈ ఏడాది అంతకు ఒక్క రోజు ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది.

హాలీవుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో హైప్ వచ్చిన రెండో మూవీగా అవేంజర్స్ నిలిచింది. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ మూవీకి మాత్రమే అవేంజర్స్ కంటే ఎక్కువగా హైప్ వచ్చింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీల్లో ఇన్ఫినిటీ వార్‌ విడుదలవుతోంది.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ అమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్లు రాబట్టొచ్చని అంచనా. ఆంటోనీ రూస్సో, జో రూస్సో ఈ మూవీకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జెర్మీ రెన్నెర్, శామ్యూల్ జాక్సన్, విన్ డీజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: