Connect with us

Movie News

రంభకి ఏమైంది..? దారుణమైన పరిస్థితిలో రంభ..!

Published

on

సినిమా అవ‌కాశాలు రాన‌ప్పుడు వాటికోసం చెప్పులు అరిగేలా తిరిగాల్సిందే. మూవీ అవ‌కాశాలు లేక ఖాళీగా ఉన్న న‌టులను లెక్కపెడితే చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు రంభ ప‌రిస్థ‌తి కూడా అలాగే ఉంద‌ట‌. సినిమా అవ‌కాశాల కోసం ఆమె తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. రంభ అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒకప్ప‌ట్లో సార్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఆమె, స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న నటించింది.

బ‌ళ్ళు ఓడ‌ల‌వుతాయి. ఓడ‌లు బ‌ళ్ళు అవుతాయ‌నే సామెత సినీ సెల‌బ్రెటీల‌కు బాగా స‌రిపోతుంది. సినిమా అవ‌కాశాలు ఉన్న‌ప్పుడు సెల‌బ్రెటీల జీవితం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా ఉంటుంది. కానీ అవశాలు లేన‌ప్పుడు సెల‌బ్రెటీల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేరు. మంచి ఫామ్ లో ఉన్న‌ప్పుడే అవ‌కాశాలు వ‌ద్ద‌న్నా త‌న్నుకుంటూ వ‌స్తాయి. అయితే ప‌రాజ‌యంలో ఉన్న‌ప్పుడు అవ‌కాశాల‌ను వెతుక్కోవాలి. అందుకే దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌న్న నానుడిలా అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడే డ‌బ్బులు సంపాదించుకుని వెన‌కేసుకుంటారు కొంత‌మంది సెల‌బ్రెటీలు. . సెల‌బ్రెటీల జీవితం ఎప్పుడూ ఏలా ఉంటుందో చెప్పలేము.

ఒకప్పుడు రంభ త‌న నటనతో తెలుగు ప్రేక్షకుల మనస్సుల‌ను కొల్లగొట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎనలేని పేరు ప్రఖ్యాత‌లు పొందిన ఆమె, తెలుగు అభిమానుల‌ను సంపాదించుకుంది. అప్పట్లో మెగాస్టార్ కి ధీటుగా డాన్స్ చెయ్యగలదని పేరు తెచ్చుకుంది రంభ. కానీ ఇండస్ట్రీ లోకి ఎప్పటికప్పుడు కుర్ర హీరోయిన్లు వచ్చేస్తున్నారు. హీరోలది ముసలి ముఖాలయినా రిసీవ్ చేసుకునే తెలుగు ప్రేక్షకులు అదే హీరోయిన్ల విషయానికి వస్తే కొత్త అందాలను కోరుకుంటున్నారు.

దీంతో రంభ‌కు ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తరువాత మలేషియాకి చెందిన పద్మనాభాన్ని పెళ్లి చేసుకున్న రంభ ఇద్దర పిల్లలకు జ‌న్మ‌నిచ్చింది. సినిమాలకి గుడ్ బై చెప్పేసి భర్తతో పాటు కెనడాలో ఫ్యామిలీ పెట్టేసింది ఈ అందాల తార. అయితే పిల్లలు పుట్టిన తరువాత భర్త‌తో విబేధాలు రావ‌డంతో కోర్టులో ఫిర్యాదు చేసింది. భర్తకు విడాకులు ఇచ్చి పిల్ల‌ల‌తో సహా చెన్నై లో సెటిల్ అయ్యిందని అందరూ అనుకున్నారు. కానీ రంభ‌ మళ్ళీ తిరిగి భర్త ద‌గ్గ‌ర‌కు చేరుకోవ‌డంతో అవన్నీ ఒట్టి రూమ‌ర్స్ అని అనుకున్నారు. రంభ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని, కానీ అవ‌కాశాలు రావ‌డం లేద‌నే వార్త‌లు వస్తున్నాయి.

సినిమా అవ‌కాశాల కోసం వేచి చూసిన ఆమె, కొన్ని టీవీ రియాల్టీ షోస్ చేస్తూ కాలాన్ని నెట్టుకొస్తోంది. అయితే తాజాగా రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంభ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా న‌టిస్తుంద‌నే వార్తలు వినిపించాయి. అయితే రంభ ఇలా సినిమాల్లోకి వెళ్ళడం అతని భర్తకు ఇష్టం లేదంట.

దాంతో రంభ మళ్ళీ తన పిల్లలని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందని వార్త‌లు వ‌స్తున్నాయి. తన భర్త పైన నమ్మకం లేని రంభ తన పిల్లల భవిష్యత్ కోసం సినిమాల్లో న‌టించి డబ్బులు సంపాదించాలని భావిస్తుందట.. తన జీవితాన్ని పూర్తి స్థాయిలో సినీ ఇండస్ట్రీకి అంకితం చేయ్యాలని భావిస్తుందట. దాంతో ఆమె మళ్ళి తన భర్తను వదిలివేసి తన పుట్టింటికి వెళ్ళినట్లు సోషల్ మీడియా వార్తలు చెక్కర్లు కోడుతున్నాయి. ఇక విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. VV సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రంభ.

Latest News

Trending

%d bloggers like this: