Connect with us

Movie News

హీరోయిన్ గా సక్సెస్ అయినా రోజా రమణి కొడుకును ఫెయిల్యూర్ హీరోగా నిలబెట్టింది

Published

on

రోజారమణి తెలుగు సినిమా నటి. భక్త ప్రహ్లాదలో బేబి రోజారమణిగా చాలా మంచి పేరు పొందింది. ఆ సినిమాలో నటనకుగాను జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం అందుకుంది. 1970 మరియు 1980 వ దశకాల్లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమాలలో కథానాయికగా నటించింది. సుమారు 400 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది. ఆమె బ్లూ క్రాస్ లో సభ్యురాలిగా చేరి సమాజ సేవ చేస్తోంది. మాస్టర్ తరుణ్ అనే పేరుతో బాలనటుడిగా చక్కగా నటించి తరువాత యువ కథానాయకుడిగా స్థిరపడిన తరుణ్ రోజారమణి కొడుకు.

రోజారమణి మద్రాసులో జన్మించింది. ఆమె తండ్రి ఒక విలేఖరి. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు. ఆమె ఒడియా నటుడైన చక్రపాణిని వివాహం చేసుకున్నది. ఆయన ప్రస్తుతం ఈటీవీ ఒడియా చానల్ లో దర్శకుడు మరియు నిర్మాత. వారి కుమారుడు ప్రముఖ హీరో తరుణ్. కూతురు అమూల్య సైకాలజీ గ్రాడ్యుయేట్.

ఆమె 5 సంవత్సరాల వయసులో భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడిగా నటించింది. ఏవీయం నిర్మించిన ఈ సినిమా మొట్టమొదటి పూర్తి నిడివి ఈస్ట్ మన్ కలర్ సినిమా. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. బాలనటిగా సుమారు 70 సినిమాల్లో నటించిన తర్వాత 13 ఏళ్ళ వయసులోనే చంబరతి అనే మలయాళ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇదే సినిమా తెలుగులో కూడా రోజా రమణి కథానాయికగా కన్నె వయసు అనే సినిమా గా తీశారు.

తరువాత అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఒడియా భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 400 సినిమాల్లో సుహాసిని, మీనా, రాధిక, రమ్యకృష్ణ, రోజా, విజయశాంతి, శిల్పాశెట్టి, దివ్యభారతి, నగ్మా, కుష్బూ లాంటి నటీమణులకు గాత్రదానం చేసింది.

Movie News

hi

Published

on

hi

Continue Reading

Movie News

ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ నిశ్చితార్థం

Published

on

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లడం ఆ తరువాత ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ఆ తరువాత అఖిల్ తన దృష్టిని మూవీస్ పై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం ఆదివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

అనిందిత్ రెడ్డి ఎవరంటే..? అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని పెళ్లిచేసుకోనున్నాడన్నమాట.

దేశ వ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

 

Continue Reading

Movie News

రానాకు మరో బాహుబలి.. భారత్‌లో భారీ స్థాయిలో

Published

on

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. కనీవిని ఎరగని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘బ్లాక్ పాంథర్‌‌’ను దాటేసింది . మన దేశంలోనూ ఈ మూవీ 2000కు పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ మూవీ.. భారత్‌లో ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీగా నిలవనుంది.

ఈ హాలీవుడ్‌ మూవీలో సూపర్‌ హీరోలందరూ యాక్ట్ చేసారు. థానోస్ అనే సూపర్ విలన్ బారి నుంచి డజను మందికిపైగా హీరోలు కలిసి భూమిని కాపాడటమే ఈ మూవీ కథ. విలన్ థావోస్ క్యారక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. భారత మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాగా.. ఈ ఏడాది అంతకు ఒక్క రోజు ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది.

హాలీవుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో హైప్ వచ్చిన రెండో మూవీగా అవేంజర్స్ నిలిచింది. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ మూవీకి మాత్రమే అవేంజర్స్ కంటే ఎక్కువగా హైప్ వచ్చింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీల్లో ఇన్ఫినిటీ వార్‌ విడుదలవుతోంది.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ అమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్లు రాబట్టొచ్చని అంచనా. ఆంటోనీ రూస్సో, జో రూస్సో ఈ మూవీకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జెర్మీ రెన్నెర్, శామ్యూల్ జాక్సన్, విన్ డీజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: