Connect with us

Political News

sbi ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకు, అదేంటో మీరే చూడండి.

Published

on

ఖాతాల్లో కనీస నిల్వ లేదన్న సాకుతో బ్యాంకులు ఖాతాదారులను ఎడాపెడా బాదుతున్నాయి. రెగ్యులర్‌ బిజినె్‌సలో సంపాదించే లాభాలకంటే కూడా కొన్ని బ్యాంకులకు, ఇలా కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్న మొత్తాలే ఎక్కువగా ఉంటున్నాయి. బ్యాంకులు హఠాత్తుగా ఇలా వడ్డనలకు దిగడంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ఖాతాల్లో కనీస నిల్వలేదన్న కారణంగా గతేడాది ఏప్రిల్‌-నవంబరు మధ్య కాలంలో పిఎ్‌సయు బ్యాంకులు ఇన్వెస్టర్ల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన పెనాల్టీల మొత్తం 2,320 కోట్ల రూపాయలుంది. దిగ్గజ బ్యాంకింగ్‌ సంస్థ ఎస్‌బిఐ వాటా ఈ మొత్తంలో 1,771 కోట్ల రూపాయలుంది.

ఎస్‌బిఐ గతేడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో సంపాదించిన నికర లాభం 1,581 కోట్ల రూపాయల కంటే, ఇలా పెనాల్టీల పేరుతో ఖాతాదారుల నుంచి జబర్దస్తీగా వసూలు చేసిన మొత్తమే ఎక్కువ. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత మోదీ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం, ఆర్‌బిఐ అండతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కనీస నిల్వ నిబంధనలను బ్యాంకులు మళ్లీ తెరపైకి తెచ్చా యి. నిబంధనలకు అనుగుణంగా ఖాతాల్లో కనీస నిల్వను నిర్వహించకుంటే జరిమానాలు వేస్తున్నాయి. చార్జీలు వసూలు చేస్తున్నాయి. బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతాలు, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాలకు మాత్రం ప్రస్తుతం ఈ చార్జీల నుంచి మినహాయింపు ఉంది.

ఏ బ్యాంకు వాటా ఎంత ?

కనీస నిల్వ నిబంధనల పేరుతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) పెనాల్టీల కింద సంపాదించిన లాభం ఏప్రిల్‌-నవంబరు కాలంలో 97.34 కోట్ల రూపాయలుంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్జన 68.67 కోట్ల రూపాయలుండగా కెనరా బ్యాంకు సంపాదన 62.16 కోట్ల రూపాయలుంది.

ఖాతాలో ఎంత ఉండాలి..

ఎస్‌బిఐ బ్యాంకు వివరణల ప్రకారం, మెట్రో నగరాల్లోని బ్యాంకు శాఖల్లో ఖాతాలున్నవారు కనీసం 5,000 రూపాయలు నిల్వ ఉంచాలని మొదట ప్రకటించారు. తర్వాత దీనిని 3,000 రూపాయలకు తగ్గించారు. అర్బన్‌ ఏరియాల్లోని బ్యాంకు శాఖల్లో 3,000 రూపాయల కనీస నిల్వ, సెమి అర్బన్‌ ఏరియాల్లో 2,000 రూపాయలు. గ్రామీణ ప్రాంత శాఖల్లో కనీసం 1,000 రూపాయల నిల్వ ఉండాలి. పెన్షనర్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు మాత్రం మినహాయింపునిచ్చారు.

ఎంత వడ్డిస్తున్నారు..

ఎస్‌బిఐ ఈ మధ్యనే చార్జీలను పెంచింది. మెట్రో నగరాల్లో కనీస నిల్వకంటే సొమ్ము 75 శాతం పైగా తక్కువగా ఉంటే 100 రూపాయల పెనాల్టీ ప్లస్‌ సర్వీస్‌ టాక్స్‌ విధిస్తున్నారు. కనీస నిల్వకంటే 50 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటే మాత్రం 50 రూపాయల వడ్డన ఆపై సర్వీస్‌ టాక్స్‌ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పెనాల్టీ 20-25 రూపాయల మధ్యన ఉంది.

బ్యాంకులు వసూలు చేస్తున్న చార్జీలు ఎక్కువగా పెంచాయి. కనీస నిల్వకంటే తక్కువగా ఉన్న మొత్తంపై వార్షికంగా 78 శాతం వరకు చార్జీల కింద కొన్ని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. నిజానికి ఆర్‌బిఐ నిబంధనలను కూడా ఈ విషయంలో బ్యాంకులు తుంగలో తొక్కుతున్నారు.

 

Latest News

Trending

%d bloggers like this: