Connect with us

Political News

భర్తను చంపిన శ్రీవిద్య అరెస్టు నవ్వు ముఖంతో పోలీసుల మధ్య‌ ఇక్కడే బుక్కయింది

Published

on

ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తనే చంపేసిన సంఘటనలు ఈ మధ్య ఒక్కోటిగా బయటికి వస్తున్నాయి. నాగర్ కర్నూల్ లో భర్త సుధాకరరెడ్డిని చంపి అతని స్థానంలో ప్రియున్ని రీప్లేస్ చెయ్యాలనుకున్న స్వాతి, ఆమె ప్రియుడికి ఇష్టం లేని సూప్ వల్ల ఇద్దరు అడ్డంగా దొరికిపోయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుబాడులో జరిగింది.

అక్కడ నలబోతు నరేంద్ర(27)కు అదే గ్రామానికి చెందిన అతడి మేనమామ కుమార్తె శ్రీవిద్యతో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. అయితే పెళ్ళికి ముందే శ్రీ విద్యకు తన అక్క మొగుడైన గొట్టిపాటి వీరయ్య చౌదరితో వివాహేతర సంభందం ఏర్పడడంతో నరేంద్రపై హత్యకు దారితీసింది. ఈ రెండు కేసుల్లో ఇద్దర్ని భార్యలే పొట్టన పెట్టుకున్నారు.అయితే సుధాకర రెడ్డి కేసులో స్వాతి , రాజేష్ లు కేవలం మటన్ సూప్ వల్ల దొరికిపోగా, నరేంద్ర హత్య కేసులో మాత్రం ఫోన్ వల్ల హంతకులు దొరికిపోయారు. తొలుత నరేంద్ర అనుమానాస్పదంగా మృతి చెందారని భావించిన పోలీసులు. ఫైనల్ గా ఇది హత్యేనని తేల్చేసారు.

నరేంద్ర మృతితో శ్రీదేవిపై అనుమానంతో ఆమె కాల్‌డేటాను చెక్ చేసారు పోలీసులు. ఆమె ఎపుడు ఆమె బావ వీరయ్య చౌదరితో మాట్లాడినట్లు తేల్చారు. అందులో శ్రీదేవి నీతో గడపడానికి మా అయన అడ్డుగా ఉన్నాడని, అందువల్ల అతన్ని ఎలాగైనా అంతమొందించాలని ఉందనే సమాచారంతోనే శ్రీదేవిపై పోలీసులు కేసు నమోదు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మొత్తానికి శ్రీ విద్య ఫోన్ కాల్ డేటా ఆధారంగా దొరికిపోయింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: