Connect with us

Movie News

అలా అంటే బట్టలు విప్పి మరి కొడతాం

Published

on

ఇక నుంచి షూటింగ్‌లు చేసేటప్పుడు అమ్మాయిల పట్ల గౌరవంగా మెలగాలని సినీ పరిశ్రమకు శ్రీరెడ్డి చెప్పారు. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడొద్దని, అదీ ఇదీ అని మాట్లాడితే మర్యాదగా ఉండదన్నారు. ఇంకోసారి ఏ అమ్మాయైనా ఫిర్యాదు చేస్తే సదరు మూవీను బయటకి కూడా రానివ్వమని హెచ్చరించారు. తెలుగు మూవీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదంపై గత కొద్దిరోజులుగా పోరాడుతున్న శ్రీరెడ్డికి మహిళా సంఘాలు అండగా నిలిచాయి.

తెలుగు సినీరంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’ అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చ నిర్వహించారు. మహిళా సంఘాల ఐక్యకార్యచరణ కమిటి ఆధ్వర్యంలో ఈ చర్చను చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీరెడ్డి, అపూర్వ సహా పలువురు మహిళా జూనియర్ ఆర్టిస్టులు, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ దర్శకులు, నిర్మాతలు, స్టార్ హీరోలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

హీరోలంతా జీరోలైపోయారని, ఈరోజు బయటికొచ్చి మాట్లాడని ఏ హీరో అయినా జీరోనే అని శ్రీరెడ్డి చెప్పారు. ప్రతి హీరో ఎక్కడో ఒక చోట మెసేజ్ పెట్టే ఉంటాడని, ఇప్పుడు మాట్లాడితే తనదెక్కడ బయటపడుతుందో అనే భయంతో ఎవ్వరూ బయటికి రావడంలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని, ఈ పోరాటం ఉద్ధృతం అవుతుందని హెచ్చరించారు. తనకు అండగా నిలిచిన ప్రతి స్త్రీ శక్తికి, ముఖ్యంగా అపూర్వ అక్కకి నా కృతజ్ఞతలు అని శ్రీరెడ్డి చెప్పారు.

అంతకు ముందు తెలుగు నటీమణుల గురించి మాట్లాడుతూ.. ‘తెలుగు అమ్మాయిలకు సంబంధించి వారి షేపుల గురించి కానీ, డైలాగ్ డెలివరీ గురించి కానీ, స్కిన్ కలర్ గురించి కానీ మాట్లాడితే గుడ్డలూడిదీసి కొడతాం. ఇక నుంచి తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వాలి. మీరంతట మీరే మారి తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాం. క్యారెక్టర్ ఆర్టిస్టుల వ్యధలు వినలేకపోతున్నాం. వాళ్లేమడుగుతున్నారు.. తిండి పెట్టండి. మీరు కోట్లకు కోట్లు తీసుకోండి. పది రోజుల పనే కదా అడుగుతున్నారు. తెరలమీద సందేశాలు ఇస్తారు. ఎందుకు మీ దిక్కుమాలిన జీవితాలు’ అని శ్రీరెడ్డి విరుచుకుపడ్డారు.

Movie News

hi

Published

on

hi

Continue Reading

Movie News

ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ నిశ్చితార్థం

Published

on

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లడం ఆ తరువాత ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ఆ తరువాత అఖిల్ తన దృష్టిని మూవీస్ పై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం ఆదివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

అనిందిత్ రెడ్డి ఎవరంటే..? అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని పెళ్లిచేసుకోనున్నాడన్నమాట.

దేశ వ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

 

Continue Reading

Movie News

రానాకు మరో బాహుబలి.. భారత్‌లో భారీ స్థాయిలో

Published

on

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. కనీవిని ఎరగని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘బ్లాక్ పాంథర్‌‌’ను దాటేసింది . మన దేశంలోనూ ఈ మూవీ 2000కు పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ మూవీ.. భారత్‌లో ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీగా నిలవనుంది.

ఈ హాలీవుడ్‌ మూవీలో సూపర్‌ హీరోలందరూ యాక్ట్ చేసారు. థానోస్ అనే సూపర్ విలన్ బారి నుంచి డజను మందికిపైగా హీరోలు కలిసి భూమిని కాపాడటమే ఈ మూవీ కథ. విలన్ థావోస్ క్యారక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. భారత మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాగా.. ఈ ఏడాది అంతకు ఒక్క రోజు ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది.

హాలీవుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో హైప్ వచ్చిన రెండో మూవీగా అవేంజర్స్ నిలిచింది. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ మూవీకి మాత్రమే అవేంజర్స్ కంటే ఎక్కువగా హైప్ వచ్చింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీల్లో ఇన్ఫినిటీ వార్‌ విడుదలవుతోంది.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ అమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్లు రాబట్టొచ్చని అంచనా. ఆంటోనీ రూస్సో, జో రూస్సో ఈ మూవీకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జెర్మీ రెన్నెర్, శామ్యూల్ జాక్సన్, విన్ డీజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: