Connect with us

Movie News

పవన్ వ్యాఖ్యలపై స్పందించిన శ్రీరెడ్డి

Published

on

గత నెల రోజులుగా టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన నటి శ్రీ రెడ్డి పోరాటంపై స్పందించిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అన్యాయం జరిగినప్పుడు చట్టపరంగా ముందుకెళ్లాలి కానీ, మీడియాకు ఎక్కడం వల్ల ఉపయోగం ఉండదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ చేసిన వ్యాఖ్యలు తనకు అసంతృప్తిని కలిగించాయని చెప్పింది. ‘పవన్ కల్యాణ్ సార్ వ్యాఖ్యలు తనకేమీ సంతోషాన్ని కలిగించలేదు. అయితే, ఇతర మహిళల రక్షణపై మాట్లాడటం, నన్ను తక్కువ చేయడం అవగాహన చేసుకోలేకపోయా. ఇది కూడా మంచి. నేనేమీ అసూయ పడలేదు. ప్రజల దృష్టి నాపై పడాలని కోరుకోవడం లేదు. అలాగే ఇతరుల మాదిరిగా నాకేమీ పాపులారిటీ అవసరం లేదు” అని ఫేస్‌బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

అంతకుముందు మరో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి.. ‘పవన్ కల్యాణ్ మహిళల సమస్యలపై మాట్లాడటం తనకు సంతోషాన్ని కలిగించిందని, ఆయన లాంటి స్టార్స్ లేదా రాజకీయ నేతలు స్పందిస్తే అసాంఘిక కార్యకలాపాలు, వేధింపులు త్వరగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని’ చెప్పారు.

శనివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని జమ్ము కశ్మీర్‌ బాలిక హత్యాచారాన్ని ఖండిస్తూ మౌన దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి ఘటనపై స్పందించారు. ‘ఇండస్ట్రీలో ఎవరైనా తప్పులు చేస్తే.. టీవీలకు వస్తే లాభం లేదు. కోర్టుల్లో కేసులు వేయండి. పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టమనండి అన్నారు. శ్రీరెడ్డి ఇష్యూలో నా స్పందన ఇదే. అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలిపితే లాభం ఉండదు. దానికి కారణమైన వారిపై పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నాకు అన్యాయం జరిగింది అని ఫిర్యాదు చేయాలి. అలా కాకుండా మీడియాకెక్కిడం, ప్రదర్శనలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.

Movie News

hi

Published

on

hi

Continue Reading

Movie News

ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ నిశ్చితార్థం

Published

on

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లడం ఆ తరువాత ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ఆ తరువాత అఖిల్ తన దృష్టిని మూవీస్ పై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం ఆదివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

అనిందిత్ రెడ్డి ఎవరంటే..? అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని పెళ్లిచేసుకోనున్నాడన్నమాట.

దేశ వ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

 

Continue Reading

Movie News

రానాకు మరో బాహుబలి.. భారత్‌లో భారీ స్థాయిలో

Published

on

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. కనీవిని ఎరగని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘బ్లాక్ పాంథర్‌‌’ను దాటేసింది . మన దేశంలోనూ ఈ మూవీ 2000కు పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ మూవీ.. భారత్‌లో ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీగా నిలవనుంది.

ఈ హాలీవుడ్‌ మూవీలో సూపర్‌ హీరోలందరూ యాక్ట్ చేసారు. థానోస్ అనే సూపర్ విలన్ బారి నుంచి డజను మందికిపైగా హీరోలు కలిసి భూమిని కాపాడటమే ఈ మూవీ కథ. విలన్ థావోస్ క్యారక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. భారత మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాగా.. ఈ ఏడాది అంతకు ఒక్క రోజు ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది.

హాలీవుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో హైప్ వచ్చిన రెండో మూవీగా అవేంజర్స్ నిలిచింది. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ మూవీకి మాత్రమే అవేంజర్స్ కంటే ఎక్కువగా హైప్ వచ్చింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీల్లో ఇన్ఫినిటీ వార్‌ విడుదలవుతోంది.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ అమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్లు రాబట్టొచ్చని అంచనా. ఆంటోనీ రూస్సో, జో రూస్సో ఈ మూవీకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జెర్మీ రెన్నెర్, శామ్యూల్ జాక్సన్, విన్ డీజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: