Connect with us

Political News

సంక్రాంతికి సొంతూరు వెళ్లే ప్రతి ఒక్కరూ తెల్సుకోవలసిన విషయం

Published

on

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి వైభవం గురించి ఇప్పటితరం వారికంటే పెద్దవాళ్లనడిగితే చాలా గొప్పగా చెబుతారు. ఈ పండుగ లో ఉన్న విశేషం ఏంటంటే, ఎక్కడ పని చేస్తున్నవారు అయినా…ఈ పండుగకు వారి సొంత ఊరు వెళ్తారు. అయితే ఈ పండుగ సందర్భంగా అటు రైల్వే, ఇటు ఆర్టీసీలు ప్రత్యేక సర్వీసులు అందిస్తున్నాయి. వివిధ ప్రాంతాల మధ్య 84 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించగా, మొత్తం 3,262 స్పెషల్‌ బస్సులను సిద్ధం చేసినట్లు ఆర్టీసీ చెబుతుంది.

జనవరి 10 నుంచి 13 వ తేదీ వరకు బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ యాదగిరి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు రోజూ నడిచే 3,065 రెగ్యులర్‌ బస్సులతోపాటు 3,262 ప్రత్యేక బస్సులను సిద్ధంచేశారు. విజయవాడ వైపు 1,094 బస్సులు, కర్నూల్‌ వైపు 115, నెల్లూరు 143, వరంగల్‌ 384, కరీంనగర్‌ 280, ఖమ్మం 430, మహబూబ్‌ నగర్‌ 179, ఆదిలాబాద్, నిజామా బాద్‌ జిల్లా లకు 259, నల్లగొండ 228, మెదక్‌ 125, బెంగ ళూరు 15, చెన్నై 5, పూణే వైపునకు 5 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలిపారు. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపుచార్జీలు వసూలు చేయనున్నారు.

పండుగ సందర్భంగా, సంక్రాంతి స్పెషల్‌ రైళ్లు ఏ టైమ్ కి ఉన్నాయో చూద్దాం.

* తిరుపతి–విశాఖ (07487/07488) ప్రత్యేక రైలు

ఈ నెల 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 7.20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.10 కు తిరుపతికి చేరుతుంది.

* కాచిగూడ–విశాఖ (07016) స్పెషల్‌ ట్రైన్‌

ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.50కి విశాఖకు చేరుతుంది.

* విశాఖ–తిరుపతి(07479) స్పెషల్‌ ట్రైన్‌ :

ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కి తిరుపతికి చేరుకుంటుంది.

* తిరుపతి– కాచిగూడ (07146) స్పెషల్‌ ట్రైన్‌

ఈ నెల 8, 15, 22, మార్చి 1 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడకి చేరుకుంటుంది.

* హైదరాబాద్‌–విశాఖ(07148/07147) స్పెషల్‌ ట్రైన్‌ :

ఈ నెల 10, 12 తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.45 కి విశాఖ చేరుతెంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 11, 13 తేదీల్లో సాయంత్రం 6.50 కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 కు నాంపల్లి చేరుకుంటుంది.

* సికింద్రాబాద్‌–దర్భంగా(07007/07008) స్పెషల్‌ ట్రైన్‌

ఫిబ్రవరి 3, 6, 10, 13, 17, 20, 24, మార్చి 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31తేదీల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి రెండోరోజు మధ్యాహ్నం 1.45కు దర్భంగా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 6, 9, 13, 16, 20, 23, 27, మార్చి 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30 తేదీల్లో ఉదయం 5 గంటలకు దర్భంగా నుంచి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10.10కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

* హైదరాబాద్‌ –రెక్సాల్‌ (07005/07006) స్పెషల్‌ ట్రైన్‌

ఫిబ్రవరి 1, 8, 15, 22, మార్చి 1,8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30 గంటకు నాంపల్లిలో బయలుదేరి రెండోరోజు సాయంత్రం 5.30కు రెక్సాల్‌ చేరుతుంది. తిరుగుప్రయాణంలో ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్‌ 1 తేదీల్లో తెల్లవారు జామున 1.30 కు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11.15 కు నాంపల్లి చేరుకుంటుంది.

పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఓ షాక్ ఇచ్చింది. పండుగ సీజన్లలో రైళ్లు ఎక్కేవారికంటే వాళ్లకు సెండ్ ఆఫ్ ఇచ్చేవారు, ఆహ్వానించేవారు ఎక్కువగా ఉంటారు. అందుకే దక్షిణమధ్యరైల్వే ప్రధాన కేంద్రం సికింద్రబాద్‌ స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచారు. ఈ నిర్ణయం సంక్రాంతి రద్దీ దృష్ట్యా జనవరి 11 నుంచి 17 వరకు పెరిగిన ధరలు అమలవుతాయని పౌరసంబంధాల అధికారి ఉమాశంకర్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: