Connect with us

Health

కాళ్ళ వాపుతో బాధపడేవారికి ఇలా చేస్తే వాపు తగ్గుతుందంట

Published

on

డయాబెటిస్ అనేది అందర్నీ ఇబ్బందికి గురి చేసే వ్యాధి. దీన్ని మనం నెగ్లెట్ చేస్తే దీని వలన ఇతర వ్యాధులు కూడా వస్తాయి. ఆ వ్యాదులలో కాళ్ళ వాపుల వ్యాధి ఒకటి. అలా మధుమేహాన్ని కలిగి ఉండి పాదాల వాపుతో సమస్యలు ఎదురుకుంటున్నారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులలో పాదాలు వాయడం అనేది సాధారణ సమస్య. రక్త పోటు అధికం అవ్వడం వలన రక్త కేస నాలికల ప్రమాదానికి గురై రక్త ప్రసరణ సరిగా జరగక పోవడం వలన పాదాలు వస్తాయి. ప్రమాదానికి గురి అయిన రక్త కేస నాలికల వలన ఎడిమ కలుగుతుంది. ద్రావానాలు లీక్ అవడం వలన చుట్టూ వుండే కనాలకి విస్తరించడం వలన వాపులకి గురి అవుతుంది. ఇవి మాత్రమే కాకుండా మధుమేహ వ్యాధి గ్రస్తులలో పాదాలు వాపుకి గురి అవడానికి చాల కారణాలే ఉన్నాయి.

మధుమేహ వ్యాధి గ్రస్తులు రోజు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది. ప్రతి రోజు వ్యాయామాలు చేసే వారిలో కాళ్ళకు, పాదాలకు రక్త సరఫరా పెరిగి రక్తం లోని చెక్కర స్థాయిలు స్తిరీకరించాపడతాయి. కాని మధుమేహ వ్యాధి గ్రస్తులు వ్యాయామాలను చేసే ముందు వైద్యుడిని చూపించుకోవాలి. కటిన వ్యాయామాలు చేయడం వలన ఎడిమ కలుగవచ్చు.

కాళ్ళను ఎదన్నా వస్తువు సహాయంతో లేదా దిండు తో మన గుండె వుండే ఎత్తు వరకు రోజు పది నుంచి పదిహేను నిమిషాల పాటు కాళ్ళను ఎత్తి ఉంచడం వలన వాపులు తగ్గుతాయ్. ఇలా ఎత్తడం వలన పాదాల్లో చేరిన నీరు ఇతర కనాల్లోకి విస్తరించపడి రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది.

మధుమేహ వ్యాధి గ్రస్తులు ఆహారాల్లో చేసే మార్పుల వలన కాళ్ళ వాపులను తగ్గించుకోవచ్చు . అలాంటి వారు ఉప్పును తక్కువగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే సోడియం రక్తపోటుని పెంచి కాళ్ళను మరింత వాచేలా చేస్తుంది.

మధుమేహ వ్యాధి గ్రస్తులు టైట్ గా ఉండే సాక్సులు వేసుకోవద్దు. షూ నెంబర్ ఉన్న దానికన్నా ఒక నెంబర్ ఎక్కువగా గల షూ తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే ఉబ్బిన పాదాలకు గాని లేదా పాదాలు ఉబ్బిన షూ బిగుతు గా అవ్వదు. అంతే కాకుండా మధుమేహ వ్యాధి కలిగిన స్త్రీ లు ఎత్తు ఎక్కువగా ఉండే షూ లేదా చెప్పులకు దూరంగా ఉండాలి. షూ లేదా చెప్పు లను కొనే ముందు నిపుణులను కలిసి వాళ్ళ సలహా తెలుసుకోవడం మంచిది.

డయాబెటిస్ వ్యాధి ఉన్న వారు పాదాలకు మసాజ్ చేయడం వలన పూర్తి కాళ్ళకు రక్త ప్రసరణ జరపబడి వాపు వలన కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఇలా కనుక రోజు చేస్తే కాళ్ళ వాపు నుండి ఉపశమనం పొందవచ్చు.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: