Connect with us

Movie News

రజనీకాంత్ జీవితంలో cm అవ్వలేడు…అంటూ సంచలన విషయాన్నీ బయటపెట్టిన జ్యోతిష్కుడు..!

Published

on

రాజకీయ ప్రవేశంపై సూపర్‌‌స్టార్ రజనీకాంత్ స్పష్టతను ఇచ్చారు. రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని ఆయన ప్రకటన చేశారు. అంతేకాదు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పెట్టి పోటీ చేస్తానని రజనీ చెప్పారు. ఈ మేరకు చెన్నైలో జరుగుతున్న అభిమానుల సమావేశంలో స్పష్టతను చెప్పారు. అయితే రాజకీయాల్లోకి రజనీ రావాలని ఎప్పటినుంచో అభిమానులు అనుకుంటున్నారు. జయలలిత చనిపోయిన తరువాత ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు డిమాండ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇన్ని రోజులు ఆలోచించిన రజనీ.. చివరకు రాజకీయాల్లోకి వచ్చేందుకే ఆసక్తి చూపారు.

అయితే నెక్ట్స్ తమిళనాడు సీఎం ఎవరు? చెన్నైకి వెళ్లి ఏ తలైవా అభిమానిని అడిగినా … మా సూపర్ స్టారే… అనేస్తున్నారు! కానీ, రజినీకి ఆ ఛాన్స్ లేదంటూ బాంబు పేల్చారు ఓ ప్రఖ్యాత జ్యోతిష్కుడు. కర్ఱాటకకు చెందిన ప్రకాష్ అమ్మునాయ్ అనే అస్ట్రాలజర్ రజినీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పారు. ఆయనది మకర రాశి, సింహ లగ్నం కావటం వల్ల సూపర్ స్టార్ ని ఓడించటం ఎవరి తరమూ కాదని చెప్పారు. అయితే, అదే సమయంలో సీఎంగా తమిళనాడుని ఏలే ఛాన్స్ కూడా లేదన్నారు. మరెవరినైనా ముఖ్యమంత్రిని చేసి తాను పార్టీ చీఫ్ గా వుంటే బావుంటుందట.

ఈ విషయంలో ఎంత వరకూ నిజం వుందో కాని… తమ హీరో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించకుండా వేరేవార్ని అందలం ఎక్కిస్తాడంటే అభిమానులు ఊరుకుంటారా? అదీగాక… రెండు దశాబ్దాల ఊగిసలాట తరువాత రాజకీయ ప్రవేశం చేస్తున్న తలైవా సీఎం అవ్వకుండా తెర వెనుక చక్రం తిప్పటానికి సిద్ధపడతాడా? ఇలాంటి బోలెడు ప్రశ్నలు! అవన్నీ పక్కన పెడితే… కర్ఱాటక జ్యోతిష్కుడు ఈ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మరో ఆసక్తికర , ఆందోళనకర విషయం చెప్పారు. రజినీకి దగ్గరి వారి నుంచే రాజకీయంగా ముప్పు ఉందంట. అలాంటి వెన్నుపోటు దారుల్ని ఓ కంట కనిపెడుతూ చాలా జాగ్రత్తగా ఉండాలంట.

Latest News

Trending

%d bloggers like this: