Connect with us

Health

పొట్టపై రోజూ 10 నిమిషాలు నువ్వుల నూనెతో మర్దన చేయడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో..!

Published

on

ఇప్పుడు అందరకీ బరువు పెద్ద సమస్య గా అవుతుంది. జీవన శైలిలో మార్పుల కారణంగా జంక్‌ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌కు అలవాటుపడి విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. దీంతో జబ్బులు ఎక్కువవుతున్నాయి . కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తెచ్చుకుంటున్నారు. ఇక ఓవర్ వెయిట్ కారణంతో బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయన్న విషయం తెలిసిందే. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బరువు అదుపులో ఉండి వ్యాధులను తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఆ జాగ్రత్తలు ఏంటో చూద్దాం….

✽ ఉదయం లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చటి నీళ్లు తాగాలి.
✽ ఉదయం పొట్ట భాగంలో నూనెతో(కొబ్బరినూనె, నువ్వులనూనె, ఆలివ్‌ నూనె) ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్‌ చేయాలి. దీంతో జీర్ణాశయం పనితీరు మెరుగవుతుంది. తొందరగా బరువు తగ్గుతారు.
✽ ప్రతిరోజూ 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం(వాకింగ్‌, జాగింగ్‌) చేస్తే బరువు తొందరగా తగ్గుతారు.
✽ ఉదయం రోజూ 10 నిమిషాల పాటు ఉదయం ఎండలో ఉండాలి.
✽ ఉదయం 9 గంటల లోపే పోషకాహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌ గా తీసుకోవాలి.
✽ మధ్యాహ్నం 1 గంటలోపే మధ్యాహ్న భోజనం చేయాలి. సాయంత్రం 7 గంటల లోపే రాత్రి భోజనం చేయాలి.
✽ సి-విటమిన్‌ అధికంగా ఉండే.. బత్తాయి, నారింజ, కమలా, నిమ్మ, స్ట్రాబెర్రీ, యాపిల్‌ తింటుండాలి.
✽ మనం తినే ఆహారంలో ఆకుకూరలు, నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి.
✽ రోజూ కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి.
✽ మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి.
✽ బయట దొరికే జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
✽ రాత్రి వేళ కనీసం ఏడు గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: