Connect with us

Movie News

సమంత: చిట్టిబాబు లేకుంటే ఈ రామలక్ష్మి లేదు

Published

on

రంగస్థలం మూవీకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు దేవుళ్లకు ధన్యవాదాలు చెప్పారు సమంత. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో అభిమానుల సమక్షంలో జరుగుతున్న ‘రంగస్థలం మూవీ విజయోత్సవ వేడుక’లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రంగస్థలం రామలక్ష్మి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రంగస్థలం’ మూవీ పెద్ద సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మేం ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని అందించారు ప్రేక్షకులు . ఇక కలెక్షన్ల పరంగా పెద్ద పర్స్ అందించారు.

ఈ రామలక్ష్మి క్యారెక్టర్ నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. ఇంత మంచి క్యారక్టర్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్ గారికి రుణపడి ఉంటానన్నారు. ఇక రంగస్థలం హీరో చిట్టిబాబు గురించి మాట్లాడుతూ.. చిట్టిబాబు లేకుంటే రామలక్ష్మి లేదు. ఈ మూవీలో ఆయన పాత్ర వల్లే రామలక్ష్మి పాత్రకు ఇంత పేరు వచ్చిందన్నారు. ఇక రంగస్థలానికి పనిచేసిన టెక్నీషియన్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ‘రంగస్థలం’ మూవీకి బ్లెస్సింగ్స్ అందిస్తూ.. ఈ విజయోత్సవ వేడుకకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌కు ప్రత్యేక ధన్యవాదాలను చెప్పారు సమంత.

Latest News

Trending

%d bloggers like this: