Connect with us

Movie News

అమ్మకు ఫోన్ చేసి పాప పడుకుందా అని అడిగేదాన్ని

Published

on

ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా యాక్ట్ చేసిన తమిళ మూవీ ‘దియా’. తెలుగులో దీన్ని ‘కణం’ పేరుతో విడుదల చేస్తున్నారు. నాగశౌర్య హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీను ఏఎల్‌ విజయ్‌ తెరకెక్కించాడు. ఏప్రిల్‌ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి మీడియాతో మాట్లాడింది. తన క్యారక్టర్, వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఆసక్తికర వివరాలను పంచుకుంది.

డైరెక్టర్ ఫస్ట్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు సాయి పల్లవి వెంటనే వద్దని చెప్పిందట. తమిళంలో ఇదే ఫస్ట్ మూవీ కావడంతో.. తల్లి క్యారక్టర్ లో యాక్ట్అం చేయడానికి అంగీకారానిచలేదట. అయితే విజయ్ ఆ మూవీ స్క్రిప్ట్‌ను సాయి పల్లవి అమ్మకు పంపించారట. అమ్మ స్క్రిప్ట్‌ అంతా చదివి ‘ఎందుకు నో చెప్పావు. ఇలాంటి ఒక కథను ఎంచుకుంటే బాగుంటుంది’ అని చెప్పిందట. అమ్మ మాటతో వెంటనే ఒప్పుకున్నట్లు సాయి పల్లవి చెప్పింది.

సినిమా చేస్తున్నంత సేపూ తనను తాను ఓ తల్లిగానే ఊహించుకున్నట్లు సాయి పల్లవి తెలిపింది. షూటింగ్‌ అయిపోయిన మూడు వారాల పాటు అమ్మకు ఫోన్‌ చేసి ‘పాప తిన్నదా? పాప పడుకుందా’ అని సరదాగా ఏడిపించేదాన్ని అని చెప్పుకొచ్చింది ఫిదా బ్యూటీ సాయి పల్లవి.

‘ఈ సినిమాపై నా ఆలోచనా తీరు మారింది. నేను చేస్తున్న ప్రతి సినిమాలో నాలోని కొత్త మనిషిని చూసుకోగలుగుతున్నాను. అది నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. దర్శకులంతా నాకు మంచి అవకాశాలు ఇస్తున్నారు. కణం సినిమా చేసిన తర్వాత తల్లి పాత్రలో ఎందుకు నటించానా? అనే అసంతృప్తి ఏమాత్రం లేదు’ అని సాయి పల్లవి చెప్పింది.

Latest News

Trending

%d bloggers like this: