డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రోద్బలంతో నటి శ్రీరెడ్డి తన తల్లిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వరుస ట్వీట్లతో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పవన్.. టీవీ9, ఏబీఎన్, టీవీ5 అధినేతలపై నిప్పులు చెరిగారు. తన తల్లిపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తే.. వాటిని ఖండిచకుండా వ్యాపారానికి వాడుకున్నారని విమర్శించారు.
ఆ తర్వాత మెగా ఫ్యామిలితో కలిసి ఫిల్మ్ చాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి భారీ ఎత్తున చేరుకున్న అభిమానులు మీడియాపై ఆగ్రహంతో వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి పలు ప్రకటనలు చేశారు.
‘‘శ్రీనిరాజుకు టీవీ9లో పెట్టుబడులు ఉన్నాయి. అంతేకాదు, అతనికి సత్యం రామలింగరాజు, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కూడా సంబంధాలున్నాయి’’ అని పవన్ ట్వీట్ చేశారు.
‘‘శ్రీనిరాజు రేపు నా మీద పరవు నష్టం దావా వేయనున్నారు. జనసైనికులారా మీరెవ్వరూ ఆవేశపడొద్దు. ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడవద్దు. నేను కూడా ఆయా చానెళ్ల అధినేతలతో శక్తివంతమైన న్యాయపోరాటానికి రెడీ అవుతున్నాను. అని మరో ట్వీట్లో చెప్పారు.
బాయ్‌కాట్ టీవీ9, టీవీ5, ఏబీఎన్’:
‘‘మన తల్లులు, కూమార్తెలు, చెల్లెళ్లలను దుర్బషలాడుతున్న టీవీ9, టీవీ5, ఏబీఎన్‌లను బాయ్‌కట్ చేయండి. నిస్సహాయ సోదరి, నగ్నత్వం, అసభ్యతతో వ్యాపారం చేస్తున్న వాళ్లను సైతం మనం బాయ్‌కట్ చేయాలి’’ అని పవన్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.
Like this:
Like Loading...
Related