Connect with us

Movie News

కత్తి మహేష్ ని తిట్టిన రేణు దేశాయ్

Published

on

పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు కొన‌సాగిస్తున్నారు ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్. ఇటీవ‌ల ప‌వ‌న్ కళ్యాణ్ పై మాట‌ల దాడిని ఎక్కువగా పెంచేశారు. పవ‌న్ చేసే ప్ర‌తిప‌నినీ విమర్శిస్తున్నారు క‌త్తి మ‌హేష్. పవన్ ఒక జోకర్. ఆయనొక బ్రోకర్ అంటూ వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. కత్తి మహేష్ కేవలం సినిమాలకు మాత్రమే గతంలో రివ్యూలు చెప్పేవారు.కానీ గత కొన్నిరోజులుగా సినిమాల్లో నటించే హీరోల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలనూ మాట్లాడుతుండడం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా తయారైంది.

తన ప్రసంగాన్ని వీడియోలుగా తీస్తూ సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నాడు కత్తి మహేష్‌. పవ‌న్ అస‌లు రాజ‌కీయాల‌పై ప‌నికిరాడ‌న్న క‌త్తి మ‌హేష్, ఆయ‌న‌పై తాను పోటీ చేయ‌డానికి సిద్ద‌మ‌ని సంచ‌ల‌న వాక్యాలు చేశారు. టీవీల్లో, సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ పై ఆయ‌న చేసే వ్యాఖ్య‌లు సంచలంగా మారుతున్నాయి. మ‌రోవైపు కత్తి మహేష్ పైన ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్. ప‌వ‌న్ ను విమ‌ర్శించే హ‌క్కు క‌త్తి మ‌హేష్ కు లేదంటున్నారు.

క‌త్తి మ‌హేష్ కు ఇంకా ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తూనే ఉన్నారు. సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్, క‌త్తి మ‌హేష్ అభిమానుల మ‌ధ్య మాట‌ల యుద్దం కోన సాగుతూనే ఉంది. ప‌వ‌న్ గురించి సోష‌ల్ మీడియాలో క‌త్తి మ‌హేష్ పోస్ట్ లు చేయడం , అత‌నిని ప‌వ‌న్ ఫ్యాన్స్ బెదిరిండం జ‌రుగుతూనే ఉంది. ఇటీవ‌ల ప‌వ‌న్, కేసీఆర్ ను క‌లిసిన విష‌యం తెలిసిందే.ఈ విష‌యంపై కూడా క‌త్తి మ‌హేష్, ప‌వ‌న్ ను విమ‌ర్శించిన విష‌యం అందరికి తెలిసిందే. ప‌వ‌న్ పై వ్య‌క్తిగ‌తంగా కూడా క‌త్తి మ‌హేష్ విమ‌ర్శిన‌స్త్రాలు సంధించ‌డం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా రేణు దేశాయ్ కత్తి మహేష్‌ను హెచ్చరిస్తూ మెసేజ్ చేశారు. పవన్ కళ్యాణ్‌ వ్యక్తిగత విమర్శలు చేయడానికి మీరెవరు.

పవన్ కళ్యాణ్‌ పక్కన కూర్చోవడం కాదు కదా ఆయన చెప్పులు తుడవడానికి కూడా నువ్వు పనికిరావు అంటూ తీవ్ర స్థాయిలో రేణు దేశాయ్ సందేశాన్ని పంపించారని పవన్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అభిమానుల నుంచి వేలకొద్దీ వార్నింగ్ మెసేజ్‌లు వస్తుండటంతో, ఆ మెసేజ్‌ల మాదిరిగానే రేణు దేశాయ్ మెసేజ్‌ను కూడా పట్టించుకోవడంలేదు కత్తి మహేష్. అయితే పవన్‌తో విడిపోయినా సరే ఆయనపై మాత్రం రేణుదేశాయ్‌కు ఏమాత్రం ప్రేమ తగ్గలేదని ఈ మెసేజ్ ద్వారా తెలుస్తోందని పవన్ అభిమానులు చెప్పుకుంటున్నారు.

Movie News

hi

Published

on

hi

Continue Reading

Movie News

ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ నిశ్చితార్థం

Published

on

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లడం ఆ తరువాత ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ఆ తరువాత అఖిల్ తన దృష్టిని మూవీస్ పై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం ఆదివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

అనిందిత్ రెడ్డి ఎవరంటే..? అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని పెళ్లిచేసుకోనున్నాడన్నమాట.

దేశ వ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

 

Continue Reading

Movie News

రానాకు మరో బాహుబలి.. భారత్‌లో భారీ స్థాయిలో

Published

on

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. కనీవిని ఎరగని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘బ్లాక్ పాంథర్‌‌’ను దాటేసింది . మన దేశంలోనూ ఈ మూవీ 2000కు పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ మూవీ.. భారత్‌లో ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీగా నిలవనుంది.

ఈ హాలీవుడ్‌ మూవీలో సూపర్‌ హీరోలందరూ యాక్ట్ చేసారు. థానోస్ అనే సూపర్ విలన్ బారి నుంచి డజను మందికిపైగా హీరోలు కలిసి భూమిని కాపాడటమే ఈ మూవీ కథ. విలన్ థావోస్ క్యారక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. భారత మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాగా.. ఈ ఏడాది అంతకు ఒక్క రోజు ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది.

హాలీవుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో హైప్ వచ్చిన రెండో మూవీగా అవేంజర్స్ నిలిచింది. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ మూవీకి మాత్రమే అవేంజర్స్ కంటే ఎక్కువగా హైప్ వచ్చింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీల్లో ఇన్ఫినిటీ వార్‌ విడుదలవుతోంది.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ అమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్లు రాబట్టొచ్చని అంచనా. ఆంటోనీ రూస్సో, జో రూస్సో ఈ మూవీకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జెర్మీ రెన్నెర్, శామ్యూల్ జాక్సన్, విన్ డీజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: