Connect with us

Movie News

రవితేజ నేల టిక్కెట్టు మూవీ టీజర్‌

Published

on

‘నేల టిక్కెట్టు’ గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు. అంటూ మాస్ మసాలా దట్టించిన ‘నేల టిక్కెట్టు’ మూవీ టీజర్‌తో వచ్చేశారు మాస్ రాజా రవితేజ. డైరెక్టర్ కల్యాణ్‌ కృష్ణ డైరేక్షన్ లో తెరకెక్కుతోన్న రవితేజ మూవీ’నేల టికెట్‌’. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి హిట్స్ అందించిన కళ్యాణ్‌కృష్ణ ఈ మూవీకి డైరెక్టర్. రవితేజ మార్క్ ఎంటర్ టైన్మెంట్‌తో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో రామ్‌ తళ్లూరి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయగా మాస్ ఆడియన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ను రాబట్టింది.

‘చుట్టూ జనం మధ్యలో మనం అలా ఉండాల్రా లైఫ్ అంటే’.. అని మాస్ రాజా రవితేజ బస్తీ జనంతో కలిసిపోయి ఊరమాస్ గెటప్‌లో మ.. మ.. మాస్ అనిపిస్తున్నాడు. అయితే ‘నేల టిక్కెట్’ మూవీ టీజర్‌లో ఆలోచింపచేసే.. అదుర్స్ అనిపించే సన్నివేశాలు లేకపోయినప్పటికీ వినోదాత్మకంగా మాస్ రాజా గత మూవీలను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా రవితేజ అభిమానులు కోరుకునే అన్ని మాస్ ఎలిమెంట్స్ ‘నేల టిక్కెట్’ మూవీ టీజర్‌లో పుష్కలంగా ఉన్నాయి.

ఈ మూవీలో రవితేజ రెండు షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లెక్చరర్ క్యారక్టర్ లో మరోసారి కనిపించబోతున్నాడు రవితేజ. ఈ మూవీ ద్వారా మోడల్‌ మాళవిక శర్మ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఇందులో ఆమె మెడికల్ స్టూడెంట్‌గా కనిపించనుంది. ఇక లెక్చరర్, స్టూడెంట్ మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకునే విధంగా ఉండబోతోందని టీజర్‌ను బట్టి అర్థమౌతోంది.

రవితేజ, మాళవిక హీరోహీరోయిన్లుగా.. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శీను, సురేఖా వాణి తదితరులు ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కంప్లీట్ చేసుకుని మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది మాస్ రాజా ‘నేల టిక్కెట్’మూవీ.

Latest News

Trending

%d bloggers like this: