Connect with us

Movie News

ఎన్టీఆర్, రామ్ చరణ్‌ అలా చేయకూడదని నిర్ణయించుకున్నారట

Published

on

దసరాకు ఎన్టీఆర్ మూవీ రానుంది. మరి చరణ్‌ బోయపాటి మూవీ కూడా అదే టైంలో వస్తుందా. చరణ్‌, ఎన్టీఆర్‌ల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ పెరిగిందంటున్నారు సినీవర్గాలు. ఇది ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా ఉంటుందా. వీరి మధ్య ఇక పోటీ ఉండదా. ఎన్టీఆర్, చరణ్‌ పోటీ పడొద్దని అనుకుంటున్నారా. ఇద్దరి మధ్యా ఫ్రెండ్లీ అండస్టాండింగ్. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీలో యాక్ట్ చేస్తూన్నారు. ఈ మూవీషూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దసరా కానుకగా విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు. రీసెంట్‌గా ఎన్టీఆర్ తన మూవీలను దసరాకే విడుదలకు చేస్తున్నారు.

రంగస్థలం మూవీతో భారీ హిట్ కొట్టిన చరణ్‌ కూడా ఇప్పుడొక మూవీలో యాక్ట్ చేస్తున్నారు. బోయపాటి డైరెక్షన్‌లో మూవీను మొదలుపెడుతున్నారు. హీరోతో అవసరం లేని సీన్లను ఇప్పటికే తీస్తున్నారు బోయపాటి. ఈ మూవీ కోసం కండలు పెంచుతున్న చరణ్‌ ఈ నెల 21 నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారట. ఈ మూవీ కూడా అక్టోబర్ నెలకు విడుదలవుతోంది. అక్టోబర్ నెల నాటికి మూవీ రెడీ అయినా ఎన్టీఆర్ మూవీతో పోటీ పడకూడదని చరణ్‌ నిర్ణయించుకున్నారట. ఇద్దరి మూవీల మధ్య మూడు వారాల గ్యాప్ ఉండేలా చూసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట.

ఇంతకుముందు పోటీ పడేవారు.. ఇప్పుడు అస్సలు అలాంటివి చేయకూడదన్న నిర్ణయానికి ఇద్దరూ వచ్చేశారట. రాంచరణ్‌, ఎన్టీఆర్ త్వరలోనే కలిసి యాక్ట్ చేస్తున్నారు. రాజమౌళి కొత్త మూవీలో వీరిద్దరు హీరోలు. ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఒప్పుకోక ముందు నుంచి ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేదట. మరి ఇప్పుడు మరింత థిక్ ఫ్రెండ్స్ అయిపోయారట.

Latest News

Trending

%d bloggers like this: