Connect with us

Movie News

కుర్ర హీరోతో మాజీ సీఎం భార్య రొమాన్స్ సినిమా

Published

on

కుర్ర హీరోతో రొమాన్స్‌కు మాజీ సీఎం భార్య ఓకే చెప్పిన వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి భార్య రాధిక.. పెళ్లికి ముందు మంచి గ్లామరస్ హీరోయిన్. ఆమె సినిమాలు చేస్తున్న సమయంలోనే డిస్ట్రిబ్యూటర్ కం నిర్మాతగా ఉన్న మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్నాటక మాజీ సీఎం అయిన కుమార స్వామిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. కుమార‌స్వామికి అప్ప‌టికే అనిత‌తో వివాహమైంది. అయితే ఈ గ్లామరస్ హీరోయిన్ ను మనువాడేందుకు అతగాడు మొదటి భార్యకు డైవర్స్ ఇచ్చేసాడు.

వారికీ ఓ పాప కూడా జన్మించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా…కొద్ది కాలం క్రితం రాధిక‌, కుమార‌స్వామి ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. దీంతో వీరు విడిగా ఉండడమే కాకుండా విడాకులకు సైతం కోర్టులో అప్లయ్ చేశారు. అయితే ఇంకా డైవర్స్ ఫైనల్ కాలేదు. ఇంతలో రాధిక మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అయింది. అయితే ఈ సారి ఆమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కాకుండా ఓ యంగ్ హీరో స‌ర‌స‌న హీరోగా ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌కు ఓకే చెప్పినట్లుగా సినీ వర్గాల్లో ఈ వార్త సంచలనంగా మారింది.యంగ్‌ హీరోకు జోడీగా అదిరిపోయే రొమాంటిక్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు రాధికఓకే చెప్పింది.

ఒక మాజీ సీఎం భార్య మళ్లీ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడం అంటే అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అది కూడా యంగ్ హీరోతో రొమాంటిక్ మూవీ అంటే అందరూ షాక్ అవుతున్నారు. గతంలో రాధిక పలు చిత్రాలు చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికి కూడా కన్నడంలో రాధిక సినిమాల కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఒక కూతురు పుట్టి, సినిమాలకు పది సంవత్సరాలు గ్యాప్‌ వచ్చినా కూడా రాధిక అందంలో ఏమాత్రం మార్పులు రాలేదు. మాజీ సీఎం భార్య అయిన రాధిక మళ్లీ కన్నడ ప్రేక్షకులను అలరిస్తుందా, మళ్లీ బిజీ హీరోయిన్‌గా అవుతుందా అనేది చూడాలి మరి.

Latest News

Trending

%d bloggers like this: