Connect with us

Movie News

కోహ్లీ జాతకంలో శుక్ర మహాదశ.. సచిన్‌ను మించడం పక్కా!

Published

on

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ప్రస్తుతం శుక్రమహర్దశ నడుస్తోందని, దీంతో అతడు క్రికెట్‌లో అత్యుత్తమ స్థానానికి చేరుకుంటాడని ప్రముఖ జ్యోతిషుడు నరేంద్ర బుందే అంటున్నారు. ఈ పరుగుల యంత్రం కెరీర్ 2025 నాటికి పై ఎత్తుకు చేరే అవకాశం ఉందని నాగ్‌పూర్‌కి చెందిన క్రికెట్ సర్కిల్‌ ఆస్ట్రాలజర్ నరేంద్ర బుందే తెలిపారు. టీ20, వన్డే ప్రపంచ కప్‌లను కోహ్లీ అందుకుంటాడని ఆయన తెలియజేశారు. క్రికెట్ గాడ్, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 100 సెంచరీల రికార్డును సైతం కోహ్లీ అధిగమిస్తాడని, క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చేసుకుంటాడని ఆయన పేర్కొన్నారు. ఇది గతంలో మార్క్ మస్కరెన్హాస్‌కు చెందిన వరల్డ్ టెల్ సంస్థతో సచిన్ చేసుకున్న ఒప్పందంతో పోలిస్తే చాలా పెద్దదని అంటున్నాడు.

అంతేకాదు గతంలో తాను చెప్పిన విషయాలన్నీ నిజమయ్యాయని, ఇవి కూడా నిజమవుతాయని జ్యోతిషుడు నరేంద్ర బుందే బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. కోహ్లీ జాతకంలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉండటతో కెప్టెన్‌గా విదేశాల్లోనూ మంచి విజయాలు సాధిస్తాడని, ఆస్ట్రేలియా పర్యనటలో ఇండియా పైచేయి సాధిస్తుందని అంటున్నారు. బంగారు నగల వ్యాపారం చేసే నరేంద్ర బుందే 2006 నుంచి క్రికెటర్ల జాతకాలు, భవిష్యత్తు గురించి చెబుతున్నారు. ఈయన వద్ద టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మురళీ కార్తీక్‌, శ్రీశాంత్‌, జహీర్‌, గంభీర్‌, రైనా, ప్రీతి జింటా లాంటి ప్రముఖులు సలహాలు తీసుకున్నారు.

టెండూల్కర్, ధోనీ విషయాల్లో ఆయన చెప్పినట్టు జరగడంతో టీమిండియా, కోహ్లీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సచిన్‌ మోచేతి గాయం నుంచి కోలుకుంటాడని, ఆయనకు భారతరత్న పురస్కారం వస్తుందని ఈయనే ముందుగా చెప్పారు అంతేకాదు 2011లో భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని కూడా చెప్పాడు.

Latest News

Trending

%d bloggers like this: