Connect with us

Movie News

అవమానం తట్టుకోలేక యాంకర్ ప్రదీప్ ఆత్మహత్య ప్రయత్నం, సోషల్‌ మీడియాలోహల్చల్ చేస్తున్నన్యూస్..!

Published

on

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ లో పాపులర్ టీవీ యాంకర్ ప్రదీప్‌ పోలీసులకు దొరికిపోయిన విషయం అందరికి తెల్సిందే. జూబ్లిహిల్స్ రోడ్డు నంబర్‌ 45 వద్ద మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రదీప్‌ పోలీసులకు దొరికిపోయాడు.పీకలదాకా మద్యం తాగిన ప్రదీప్.. పోలీసుల కంటపడకుండా ఇంటికి చేరుకోవచ్చులే అనుకున్నాడేమో గానీ ధైర్యంగా వాహనం నడుపుతూ వెళుతుండగా ఇంతలో పోలీసులు ఆయనకు సడన్‌ షాకిచ్చారు.

ప్రదీప్ నోరు తెరిపించి బ్రీత్‌ అనలైజ్ చేయగా..ఒకటి రెండు కాదు ఏకంగా 178 పాయింట్లు వచ్చాయి. కాగా ప్రదీప్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతను డ్రైవ్ చేస్తున్న బీఎం డబ్ల్యూ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రదీప్‌కు మంగళవారం అతని పేరెంట్స్ సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి, కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. కానీ మంగళవారం ప్రదీప్ హాజరు కాలేదు.. శుక్రవారం వరకు గడువు ఉండడం తో ప్రదీప్ ఎప్పుడు కోర్టుకి హాజరవుతారు అనేది తెలియాల్సి ఉంది. ఈ లోపు సోషల్ మీడియా లో ప్రదీప్ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ హల్చల్ చేస్తుంది. స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న తనకు ఇలా అవమానం జరగడం ఏంటి..అని బాధ పడుతున్నట్టు మీడియా లో వార్తలు వస్తున్నాయి.

అంతే కాదు ఒక్కసారిగా ప్రదీప్ ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడే విధంగా రకరకాలుగా ఆలోచిస్తున్నట్లు ఉన్నాడని కొంతమంది సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారు.వాస్తవానికి ప్రదీప్ దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు..ఈ రోజుల్లో మద్యం సేవించడం అనేది పెద్ద న్యూస్ కాదు..అది కూడా న్యూ ఇయర్ వేడుక కాబట్టి కాస్త ఎక్కువ తీసుకున్నాడేమో అంతే కానీ దీనిని రచ్చ చేయడం అనవసరం. కానీ కొంతమంది దీనిని క్యాష్ చేసుకోవాలని రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నారు.

Latest News

Trending

%d bloggers like this: