Connect with us

Movie News

కేసీఆర్ ను పవన్ కళ్యాణ్ అందుకే కలిశారట.. మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ కత్తి

Published

on

pawan kalyan chandrashekar rao

పవర్ స్టార్, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవడంపై అందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు, ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఎన్నో మాటలు అనడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కేసీఆర్ ని కలవడం పై అందరు కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. కాటమరాయుడు సినిమా రిలీజ్ కు ముందు పవన్ కళ్యాణ్ కేటీఆర్ ని కలిసారు. ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమా కి రిలీజ్ ముందు కేసీఆర్ ని కలిసారు పవన్ కళ్యాణ్. దీని పై అనేక కామెంట్స్ వస్తున్నాయి.

ప్రగతి భవన్ లో పవన్ కళ్యాణ్ పడిగాపులు.. ‘ముఖ్యమంత్రికి న్యూ ఇయర్ విషస్ చెప్పడానికా? అజ్ఞాతవాసి ప్రీమియర్ల పర్మిషన్ కా’ అని మొదట ప్రశ్నించారు.ఆ తర్వాత ‘తెలంగాణాలో 24 గంటల పవర్ ఎలా వస్తోందో తెలుసుకున్న పవర్ స్టార్.. అబ్బా! పవర్ సర్ప్లస్ ఉంటే వస్తుంది. లేకపోతె వేరే స్టేట్ నుంచి కొనుక్కుంటే వస్తుంది. లేదా ఆంధ్రప్రదేశ్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్టులో భాగం అయితే ఉంటుంది. దీనికి ఒక పాలసీ స్టడీ. సరేగానీ, అజ్ఞాతవాసి ప్రీమియర్ షోస్ ఎన్ని పడతాయో చెప్పు బ్రదర్ ఆఫ్ మెగాస్టార్!’ అని సెటైర్‌ వేశారు.

katthi mahesh

అంతే కాకుండా నిజమే నైజాం ఏరియా టోటల్ కలెక్షన్స్ లో 50% ఉంటుంది. ముఖ్యంగా హైప్ చేసి హైదరాబాద్ లో ప్రీమియర్ల పెడితే టికెట్టుకి 3,000 నుంచీ 5,000 లాగొచ్చు. అలా లాగడానికి తోడు కావాలి అంటే , కె.సి.ఆర్ సహాయం కావాలి. భేష్! అని మహేశ్‌ కత్తి ఆరోపించారు. కేసీఆర్ ని తాట తీస్తా అని కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన్ని కలవడం, దాని పై కత్తి కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు పవన్ కాళ్ళు పట్టుకుంటే, పవన్ కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటున్నాడు అని కొందరు తెలంగాణా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం విడిపోయిందన్న బాధతో 9రోజులు అన్నం కూడా తినలేకపోయానని చెప్పిన పవన్ కళ్యాణ్  కేసీఆర్ ని ఇప్పుడు ఆత్మీయంగా కౌగిలించుకోవడం వెనుక రాజకీయ అవసరాలున్నాయని చెప్పుకుంటున్నారు కేసీఆర్ ప్రత్యర్థులు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కమ్మల తర్వాత అత్యధికమంది సెటిలర్స్ కాపులు. దీంతో ఇప్పటికే ‘వెల్ కమ్’ కాంబినేషన్ పేరిట టీడీపీలను, కమ్మలను ప్రసన్నం చేసుకున్న కేసీఆర్.. పవన్ ను కలవడం ద్వారా కాపులు కూడా తనవైపే అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. తెలంగాణలో జనసేన ఎంతవరకు పోటీ చేస్తుందో క్లారిటీ లేదు. టీఆర్ఎస్ కు జనసేనకు మంచి సంబంధాలున్నాయని సందేశం పంపేందుకు కేసీఆర్ ఈ అపాయింట్మెంట్ ఇచ్చారని అందరు అనుకుంటున్నారు.

Latest News

Trending

%d bloggers like this: