Connect with us

Political News

ఇంకెన్ని గాయాలు.. పవన్ జనసేన పాటలో అనేక ప్రశ్నలు

Published

on

ఇంకెన్ని గాయాలు? ఇంకెన్ని తూటాలు? ఇంకెన్ని మోసాలు?.. అంటూ దగాపడ్డ జనం గుండె చప్పుడును ‘జనసేన’ గొంతెత్తి పాడుతోంది. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో స్ఫూర్తిని నింపేందుకు జనసేన థీమ్ ఈ పాటని విడుదల చేసింది. జై తెలంగాణా స్లోగన్‌తో మొదలై.. భారత్ మాతా కీ జై అనే పవర్ స్టార్ నినాదంతో ముగిసే ఈ పాటకు యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అద్భుతమైన స్వరాలను సమకూర్చాడు .

జనసేన థీమ్ పాటలో స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ, ప్రత్యేక హోదా ఉద్యమ నినాదాలు హోరెత్తుతున్నాయి. ఈ ఉద్యమాల ద్వారా మహనీయుల త్యాగాలను గుర్తుచేస్తూనే అమరులైన వీరులను స్మరిస్తుంది. ‘చదువుకుంటా అని పోయాడు శవమై తిరుగొచ్చాడు నా బిడ్డ.. మేం ఎలా బ్రతకాలి సారూ’ అంటూ ఉద్యమాలలో తమ బిడ్డల బిడ్డల ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రుల కడుపుకోత వినిపిస్తుంది ఈ పాటలో.

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా భారీ ఖాళీ ప్రాంగణంలో మార్చి 14 ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పలు కీలక ప్రకటనలు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్లీనరీ సమావేశానికి లక్షల్లో పవన్ అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.

Movie News

రేయ్.. చివరకు మిగిలేది ఆరడుగుల నేల,గుప్పెడు బూడిదే

Published

on

నారు నాటితే వరి పెరుగుతుంది.. మాట జారితే గొడవ పెరుగుతుంది’.. పెదరాయుడు మూవీలో మోహన్ బాబు చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కరెక్ట్‌గా సరిపోతుంది. హోదా ఇస్తాం అని చెప్పి బీజేపీ నోరు జారడం. ప్యాకేజీ ముద్దు అంటూ టీడీపీ ఊకొట్టడం లాంటి నోరుజారిన మాటలు ఏపీలో గొడవలకు దారితీశాయి. ఈ డైలాగ్‌కు కొనసాగింపుగా.. ‘అర్థం చేసుకునే వాళ్లకు చెప్పొచ్చు అన్నయ్యా.. అర్థం చేసుకోని వాళ్ల వాళ్లకు ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు’ అని మోహన్ బాబు సౌందర్యను ఉద్దేశించి అన్న డైలాగ్ కూడా బీజేపీకి అతికించినట్టు సరిపోతుంది. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ హోదా విషయంలో కేంద్రానికి ఎంత చెప్పిన చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు అర్థం కానట్టే వ్యవహరిస్తోంది. ఈ గొడవను పక్కనపెడితే.. రీసెంట్ రాజకీయ పరిస్థితులపై నాకెందులే అని పక్కకు తప్పుకునే స్వభావం లేని మోహన్ బాబు సమయం వచ్చినప్పుడు కౌంటర్లు పేలుస్తూనే ఉంటారు. రీసెంట్ గా ఆయన ట్విట్టర్‌ పెట్టి పోస్టు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సామాజిక రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేయడం అలవాటుగా చేసుకున్న మోహన్ బాబు.. ‘మనిషికి ఉన్నది ఒకే ఒక పొట్ట.. దానికి కావలసింది రెండు పూట్లా తిండి. కానీ మీరు మీ బిడ్డలకు, బిడ్డల బిడ్డలకూ కావలసినంత దోచుకుని.. దేశంలో బ్యాంకులు చాలక స్విస్ బ్యాంకుల్లో దేశ సంపదని దాచిపెట్టుకుంటున్నారు. రేయ్.. ఎంత సంపాదించినా చివరకు మిగిలేది ఆరడుగుల నేల,గుప్పెడు బూడిద’ అంటూ ట్విట్టర్‌లో పేల్చిన పొలిటికల్ పంచ్‌లు తగలాల్సిన వాళ్లకు గట్టిగానే తగులుతున్నాయి.

Continue Reading

Movie News

తెలంగాణ రాజకీయాల్లోకి రానున్న జూనియర్ త్రిష

Published

on

ఈ రోజుల్లో’ మూవీతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగమ్మాయి రేష్మ రాథోర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతుంది. ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకుని జూనియర్ త్రిషగా పేరు సంపాదించుకుంది ఈ తెలంగాణ అమ్మాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘జై శ్రీరామ్, లవ్ సైకిల్, ప్రతిఘటన, అప్పవమ్ వీన్‌జుమ్ (మలయాళం), అధాగప్పట్టత్తు మగజనన్‌గలై (తమిళ్) మూవీలతో బాగానే అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆమధ్య ఒక ఐటెం సాంగ్‌లోనూ తళుక్కున మెరిసింది ఈ ముద్దగుమ్మ.

అయితే ఒకవైపు మూవీలతో బిజీగా ఉన్నా తనకు సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం అని అందుకే రాజకీయాల్లోకి రావాలని ఉందంటూ మనసులోకి కోరికను బయటపెట్టింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేష్మ రాథోర్ షూటింగ్ గ్యాప్ దొరకడంతో సొంత జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనకు రాజకీయాలు అంటే ఇష్టం అని ఇక్కడి ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వచ్చి సేవచేస్తా అన్నారు.

రానున్న రోజుల్లో ఖచ్చితంగా తన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని తెలంగాణ రాష్ట్రం నుండి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరతారో క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ ఓ జాతీయ పార్టీలో చేరతానంటూ హింట్ ఇచ్చారు రేష్మ రాథోర్.

Continue Reading

Movie News

కాంగ్రెస్ టికెట్ కోసం హీరోయిన్ రమ్య తల్లి పోరు!

Published

on

తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మండ్యా టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ను డిమాండ్ చేస్తోంది నటి రమ్య తల్లి రంజిత. ఈ మేరకు ఆమె తన డిమాండ్ ను బయట పెట్టింది. తను, తన కూతురు పార్టీకి ఎన్నో సేవలు చేస్తున్నామని.. ఈ నేఫథ్యంలో తనకు ఎమ్మెల్యే టికెట్ ను ఇచ్చి, తన కూతురుకు కర్ణాటక రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధిపతిగా ఉన్నారు రమ్య. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రమ్య తల్లి డిమాండ్ ఆసక్తిదాయకంగా మారింది.

గతంలో రమ్య మండ్యాకు ఎంపీగా వ్యవహరించారు. ఈ సీటుకు ఉప ఎన్నిక రాగా.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచింది రమ్య. అయితే రెండో సారి.. అక్కడ నుంచినే ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైంది ఈ హీరోయిన్. ప్రస్తుతం ఢిల్లీలో సోషల్ మీడియా విభాగంలో ఆమె పని చేస్తూ ఉన్నారు. రమ్య తల్లి తనకు ఎమ్మెల్యే టికెట్ అనే డిమాండ్ చేస్తున్నారు. తనకు అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా రెడీ అని రంజిత స్పష్టం చేశారు.

అయితే తల్లి డిమాండ్ పై రమ్య స్పందించడం లేదు. మండ్యా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న తల్లి రంజిత డిమాండ్ పై స్పందించడానికి రమ్య నిరాకరించింది. అలాగే తనకు పార్టీ పదవిని ఇవ్వాలన్న తల్లి డిమాండ్ పై కూడా రమ్య స్పందించలేదు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: