Connect with us

Movie News

అజ్ఞాతవాసి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

Published

on

ప‌వ‌న్ క‌ల్యాణ్ – త్రివిక్ర‌మ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ ఓవర్సీస్‌లో కనకవర్షం కురిపిస్తోంది. నిన్న (జనవరి 10) విడుదలైన ‘అజ్ఞాతవాసి’చిత్రంపై డివైట్ టాక్ వస్తున్నప్పటికీ తొలిరోజు కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పవన్ కెరియర్‌లోనే ప్రీమియర్ షోస్‌ ద్వారా 1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసిన ఈ చిత్రం. తొలిరోజు 1.7 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఈ విషయాన్ని ఓవర్సీస్ ట్రేడ్ పండితుడు రమేష్ బాలా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. పవన్ ‘అజ్ఞాతవాసి’ తిరుగులేని వసూళ్లను రాబడుతుందని, తొలిరోజు అమెరికాలో 1.7 మిలియన్ డాలర్లు వసూలు చేసిందన్నారు.

Ramesh Bala :

In USA, the cumulative gross now stands at $1.7 million (apprx) OUTSTANDING!

ఇక ప్రిమియర్ షోస్‌‌లో హాలీవుడ్‌ సినిమాలను వెనక్కినెట్టిన ‘అజ్ఞాతవాసి’ తొలిరోజు కలెక్షన్స్‌లోనూ సత్తా చాటింది. విడుదల రోజనే 1.5 మిలయన్ డాలర్లు వసూలు చేయడం అనేది చిన్న విషయం కాదని.. బాక్సాఫీస్ కలెక్షన్స్‌లో ఈ మార్క్‌ను చేరువడం అద్భుతం అంటూ ట్వీట్ చేశారు తరుణ్ ఆదర్శ్.

Tarun Adarsh :

Telugu film #Agnyaathavaasi takes a FANTABULOUS START in USA… Tue previews $ 1,513,540 [₹ 9.65 cr]… Yes, you read it right: $ 1.5 million on a working day… If this is not AWESOME, what is? @Rentrack

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం రూ. 26.36 కోట్లు వసూలు చేసిందని అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. ఇక ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ.5.45 కోట్లు, సీడెట్‌లో రూ.3.35 కోట్లు వసూలు చేసింది.

ఇక ఆంధ్రలోని ముఖ్యమైన సినీ సర్కిల్స్ వైజాగ్‌లో 3.75 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.3.70 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.2.86 కోట్లు, నెల్లూరులో 1.64, గుంటూరులో రూ.3.78 కోట్లు వసూలు చేసిందని సమాచారం. అయితే ‘అజ్ఞాతవాసి’ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు రీచ్ కాలేకపోయిందనే టాక్ బలంగా జనాల్లోకి వెళ్లి పోవడంతో లాంగ్‌ రన్‌ కలెక్షన్స్‌పై ప్రభావం చూపవచ్చు. దీనికి తోడు రేపు (శుక్రవారం) బాలయ్య ‘జై సింహా’చిత్రం ఉండటం. 14న సూర్య ‘గ్యాంగ్‌’లో పాటు రాజ్ తరుణ్ ‘రంగులరాట్నం’ సినిమాలు వరుసగా విడుదల కానుండటంతో ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై ప్రభావం ఉండొచ్చని మార్కెట్ అనలిస్ట్‌లు అనుకుంటున్నారు.

Movie News

hi

Published

on

hi

Continue Reading

Movie News

ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ నిశ్చితార్థం

Published

on

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లడం ఆ తరువాత ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ఆ తరువాత అఖిల్ తన దృష్టిని మూవీస్ పై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం ఆదివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

అనిందిత్ రెడ్డి ఎవరంటే..? అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని పెళ్లిచేసుకోనున్నాడన్నమాట.

దేశ వ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

 

Continue Reading

Movie News

రానాకు మరో బాహుబలి.. భారత్‌లో భారీ స్థాయిలో

Published

on

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. కనీవిని ఎరగని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘బ్లాక్ పాంథర్‌‌’ను దాటేసింది . మన దేశంలోనూ ఈ మూవీ 2000కు పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ మూవీ.. భారత్‌లో ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీగా నిలవనుంది.

ఈ హాలీవుడ్‌ మూవీలో సూపర్‌ హీరోలందరూ యాక్ట్ చేసారు. థానోస్ అనే సూపర్ విలన్ బారి నుంచి డజను మందికిపైగా హీరోలు కలిసి భూమిని కాపాడటమే ఈ మూవీ కథ. విలన్ థావోస్ క్యారక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. భారత మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాగా.. ఈ ఏడాది అంతకు ఒక్క రోజు ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది.

హాలీవుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో హైప్ వచ్చిన రెండో మూవీగా అవేంజర్స్ నిలిచింది. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ మూవీకి మాత్రమే అవేంజర్స్ కంటే ఎక్కువగా హైప్ వచ్చింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీల్లో ఇన్ఫినిటీ వార్‌ విడుదలవుతోంది.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ అమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్లు రాబట్టొచ్చని అంచనా. ఆంటోనీ రూస్సో, జో రూస్సో ఈ మూవీకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జెర్మీ రెన్నెర్, శామ్యూల్ జాక్సన్, విన్ డీజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: