Connect with us

Movie News

చిక్కుల్లో అజ్ఞాతవాసి సినిమా, ఓ ఫ్రెంచ్ సినిమాని కాపీ కొట్టిన త్రివిక్రమ్, ఆందోళనలో పవన్ కళ్యాణ్..?

Published

on

 

పవన్, త్రివిక్రమ్ కంబినేషన్స్ లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అజ్ఞాతవాసి మొత్తానికి సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ తో చిత్రం లైన్‌ క్లియర్‌ చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ ఆధారంగా తెరకెక్కించా రని వార్త వినిపిస్తుంది.ఈ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్న టీ సిరీస్ సంస్థ సరైన టైమ్ చూసుకొని ఇప్పుడు చట్తపరమైన చర్యలకు ఉపక్ర మించనుంది. ఈ విషయంలో పవన్ కు హెల్ప్ చేయడానికి రంగంలోకి దిగాడు బాలీవుడ్ లో చాలా పరిచయాలు ఉన్న రానా.

 

ఆ పరిచయాలతోనే ఈ సమస్య నుండి పవన్ ను బయటపడేయాలని చూస్తున్నాడు హీరో రానా. టీ సిరీస్ అధినేతతో రానాకు మంచి పరిచయం ఉందట. కావున వారితో మాట్లాడి ఈ సమస్యకు సరైన పరిష్కారంతో ముందుకు సాగాలని అనుకుంటున్నారు. అయితే టి-సీరిస్ వారు మాత్రం “సెన్సార్ స్క్రిప్ట్” వారికి ఇవ్వాలని అడుగుతున్నారట.తమ సినిమాతో ‘అజ్ఞాతవాసి’కి ఎలాంటి సంబంధం లేకపోతే పర్వాలేదు కానీ ఉంటే మాత్రం తాము రీమేక్ హక్కుల కోసం ఎంత ఐతే ఖర్చుపెట్టారో అంత మొత్తాన్ని వారికి చెల్లించాలని కండీషన్ ని పెట్టారట.

Latest News

Trending

%d bloggers like this: