Connect with us

Health

డెంగ్యూ ఫీవర్ ను పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే ప్రోడక్ట్స్ తో నయం చేయవచ్చు..

Published

on

ఇప్పుడు జ్వరాల సీజన్.. అందులో డెంగ్యూ జ్వరం వచ్చిందంటే ప్రణాలకే ప్రమాదం. డెంగ్యూకి ప్రత్యేకమైన మందులు లేవని, లక్షణాలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. వైద్య నిపుణుల సలహా మేరకు సరైన టైమ్ లో చికిత్స అందించాలి. అయితే కొన్ని ఆసుపత్రులు డబ్బు సంపాదన కోసం డెంగ్యూ వైద్యం పేరిట లక్షల్లో ఖర్చు చేయిస్తున్నారు. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గుతుంది. ఆ సంఖ్యను ఖర్చులేకుండా మనకు ఇంట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో ఎలా పెంచుకోవచ్చో తెలుసుకోండి ఇంతకీ డెంగ్యూ లక్షణాలు ఏమిటి, దానికి ఏం చేయాలో చూద్దాం..

డెంగ్యూ లక్షణాలు:

* జ్వరం విపరీతంగా ఉంటుంది. దాదాపు 104 ఫారెన్‌హీట్‌.
* తీవ్రమైన తలనొప్పి, చలి, ఒళ్లునొప్పులు ఉంటాయి. కళ్లలో విపరీతమైన నొప్పి.
* శరీరంపై ఎర్రటిదద్దర్లు, వాంతులు కావడం, కడుపునొప్పి
* నోరు ఆరిపోవడం, విపరీతమైన దాహం
* జ్వరం తీవ్రతను బట్టి రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది.

ఏం చేయాలంటే:

* చలితో విపరీతమైన జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను కలవాలి.
* పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రో‌లైట్స్‌ అధికంగా ఉన్న ద్రవాలను మాత్రమే తీసుకోవాలి.
* ప్లేట్‌లెట్స్‌ జీవిత కాలం ఒక్కరోజే. అది శరీరంలో నిరంతరం ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. డెంగీ జ్వరం ఉన్నప్పుడు శరీరంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతాయి. అలాంటప్పుడు వైద్యుల సలహా మేరకు అవసరం అయితేనే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాలి.
* జ్వరం వచ్చిన వెంటనే చల్ల నీళ్లతో శరీరం అంతా తుడవాలి. చల్లని ప్రదేశంలో రోగిని పడుకోబెట్టాలి. పారాసెట్మాల్‌ మాత్రను వెంటనే ఇప్పించాలి. శరీర ఉష్ణోగత్ర తగ్గేందుకు చేయాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలి.

డెంగ్యూ నివారణకు హోం రెమిడీ:

* నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి అందులోని ఒక్కో భాగంలో 10-15 లవంగాలను అందులో గుచ్చాలి. దీంతో డెంగీ దోమలు ఆ ప్రాంతంలోకి రావు.
* బొప్పాయి ఆకును తుంచి బాగా కడిగి వాటిని కలకండతో కలిపి కొన్ని నీళ్లు పోసి, మిక్సీ పట్టాలి. వచ్చిన ఆ మిశ్రమాన్ని వడగట్టి గంటకో గ్లాసు చొప్పున డెంగీ బాధితుడికి తాపిస్తే డెంగీ లక్షణాలు పూర్తిగా మాయం అవుతాయి.
* క్యారెట్‌ జ్యూస్‌, చీనీ రసం, కొబ్బరి బోండం నీళ్లు బాగా తాగిస్తే తొందరగా తగ్గే అవకాశం ఉంది.
* కొబ్బరి నూనెను పాదాల నుంచి మోకాళ్ల దాకా బాగా పూయాలి. ఇది యాంటి బయోటిక్‌గా పనిచేస్తుంది. డెంగీ దోమను దగ్గరికి రాకుండా కాపాడుతుంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: