Connect with us

Health

మా డ్రింక్ తాగొద్దు బాబోయ్ అంటూ ప్రత్యేక ప్రకటన ఇచ్చిన థమ్సప్

Published

on

యూత్ ఎక్కువగా తాగే కూల్ డ్రింక్ నిస్సందేహంగా థమ్సప్పే. బిర్యానీ తిన్నా, సమోసా తిన్నా, దానితో పాటు థమ్సప్ కాంబినేషన్ ఉండాల్సిందే. కూల్ డ్రింక్ అన్నా, పురుగుల మందు అన్నా ఒక్కటే అని చాలా కాలంగా చాలామంది చెబుతూనే ఉన్నా మనం అలాంటివేవీ పట్టించుకోము ఇప్పటికీ థమ్సప్ ను ఎత్తి, దించకుండా తాగేవాళ్లకు లెక్కలేదు. కానీ అదెంత ప్రమాదకరమో సాక్షాత్తూ ఆ కంపెనీ వాడే ప్రకటనల్లో ఇస్తున్నాడు చూడండి.

ఆ కంపెనీయే చెప్పేసుకుంది.డేంజర్రా బాబూ… కాస్త చూసి తాగండర్రా… మరీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో గుడ్డిగా తాగినట్టు గాకుండా, కాస్త చూసుకుని తాగండిరా అని ఆ కంపెనీయే పెద్ద పెద్ద యాడ్స్‌లో చెబుతుంది అర్థం కాలేదా..? మిత్రుడు ఫేస్‌బుక్ వాల్‌పై కనిపించిన ఈ పోస్టు చదవండి… ‘‘సాక్షి దినపత్రిక చివరి పేజీలో… ఈనాడు, నమస్తే తెలంగాణా, ఆంధ్రజ్యోతి దినపత్రికల మొదటి పేజీలో. ఒక ప్రముఖ తెలుగు హీరో మహేశ్ బాబు గారి థంప్స్ అప్ టేస్ట్ థండర్ యాడ్ చూసి వుంటారు మీరు అందరూ కదా… ఒక్కసారి యాడ్ చివరన కింద భాగాన మరోసారి పరిశీలించండి. 250 మి.లీ కూల్ డ్రింక్‌లో 38.8 mg కెఫిన్ కలుపుతున్నాం. ఇది అత్యధిక కెఫినేటెడ్ పానియం. దీనిని ఒకరోజులో 500 మి.లీ. మించి తాగకూడదు.

పిల్లలు, గర్భిణులు అసలే తాగకూడదు అని.లక్షల రూపాయలు పెట్టి, అందరికీ తెలిసేలా వారే యాడ్ ఇచ్చినా మనం మాత్రం గమనించడం లేదు. వాడే చెప్పేస్తున్నాడు. సిగరెట్ల డబ్బాలపై కనిపించే హెచ్చరికల్లాగా థమ్సప్ యాడ్‌లోనే ఈ హెచ్చరిక కనిపిస్తున్నా మనం ఎందుకు పట్టించుకోవడం లేదు. మహేష్ బాబు డబ్బుల కోసం నటిస్తాడు, తను మాత్రం తాగనే తాగడు. ఇది థమ్సప్ వారి చట్టబద్ధమైన హెచ్చరిక.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: