Connect with us

Health

ఈ ఒక్క వాక్సిన్ తో టైఫాయిడ్ ఇక జీవితంలో రాదు..!

Published

on

టైఫాయిడ్‌ నుంచి ఏళ్లపాటు రక్షణ కల్పించే సరికొత్త వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలో సంచలనం సృష్టించింది. సంప్రదాయ టైఫాయిడ్ జ్వరం, ఆంత్రిక జ్వరం, సాల్మొనెల్ల టైఫి గా కూడా పిలువబడుతుంది లేదంటే సాధారణంగా టైఫాయిడ్ అంటారు,ఈ వ్యాధి సాల్మొనెల్ల ఎంటేరికా సరోవర్ టైఫి అనే బాక్టీరియా వలన వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సాధారణంగా ఉన్న ఈ వ్యాధి, వ్యాధి బారినపడ్డ వ్యక్తి యొక్క మలం ద్వారా కలుషితమైన ఆహారం తిన్నప్పుడు లేదా కలుషితమైన నీళ్లు తాగినప్పుడు కడుపులోకి వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా ప్రేగు గోడకు రంధ్రం చేస్తాయి మరియు మాక్రో ఫాజేస్చే ఫాగో సైటోస్ చేయబడతాయి.

సాల్మొనెల్ల టైఫి అప్పుడు నాశనాన్ని ఎదుర్కోవడానికి తన రూపాన్ని మార్చుకుంటుంది మరియు మాక్రోఫేజ్ లోపల ఉండటానికి అవకాశం ఇస్తుంది.ఇది వాటిని PMNల యొక్క నాశనం నుండి రక్షిస్తుంది, మాక్రోఫేజేస్ ఉన్నపుడు జీవి శోషవాహిక నుండి వ్యాపిస్తుంది.ఇది వాటికి రేటిక్యులోఎండోథెలియల్ సిస్టంలోకి ప్రవేశాన్ని కల్పిస్తుంది మరియు అక్కడి నుంచి ఇతర భాగాలలోకి శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ జీవి గ్రాం-నెగటివ్ షార్ట్ బాసిల్లస్ దాని చిన్న ఫ్లాజేల్లా ద్వారా కదలికలు జరుపుతుంది. ఈ బాక్టీరియా మానవ శరీర ఉష్ణోగ్రతలో 37 °C or 99 °F* – చక్కగా పెరుగుతుంది.

యాంటీబయాటిక్‌ మందులకు లొంగని టైఫాయిడ్‌ను కూడా నయం చేయగల ఈ మందు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు భారత్‌ బయోటెక్‌ సంస్థ చైర్మన్, ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా. తాజాగా అందరికీ పంపిణీ చేసేందుకు ఈ వ్యాక్సిన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అర్హత సాధించింది.

టైపాయిడ్‌ జ్వరం కనీసం రెండు వారాలు ఉంటుంది. మొదటి వారంలో జ్వరం పెరుగుతూ చివరి వారంలో నెమ్మదిగా తగ్గుతుంది. అయితే ఇది మళ్లీ మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటది. దీన్ని నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టింది భారత్‌ బయోటెక్‌ సంస్థ. టైఫాయిడ్‌ అంటే ఒకట్రెండు ఇంజెక్షన్లు వేసుకుని నాలుగు టాబ్లెట్లు వాడితే తగ్గిపోయే వ్యాధి అన్నది చాలామందిలో ఉన్న అభిప్రాయమన్నారు కృష్ణ. అయితే వాస్తవ పరిస్థితులు అలా లేవు. కలుషిత ఆహారం, తాగునీటిలోని సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుంది.

జ్వరం, తలనొప్పి, అతిసారం వంటి లక్షణాలుండే టైఫాయిడ్‌ సోకితే మూడు రోజుల నుంచి 25 రోజుల పాటు ఉంటుంది. వ్యాధి చికిత్సకు నాలుగో తరం (ఫోర్త్ జనరేషన్) యాంటీబయాటిక్‌ మందుకూ నిరోధకత పెంచుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఇది ఇప్పటి వరకు హై ఎండ్ యాంటీ బయోటిక్. దీని తర్వాత ఏ మందు రాలేదు. అంటే ఈ మందుకు రోగం తగ్గకుంటే రోగికి మరణమే అన్నమాట. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ప్రతియేటా లక్షల్లోనే టైఫాయిడ్ తో మరణిస్తున్నారు.

భారత్‌ బయోటెక్‌ 2001లోనే సరికొత్త వ్యాక్సిన్‌ తయారీకి ప్రయత్నాలు చేస్తుంది. ఐదేళ్ల తర్వాత ప్రపంచంలోనే మొదటి కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వ్యాక్సిన్‌ పనితీరు, సమర్థతను పూర్తిస్థాయిలో అంచనా వేసింది. పిల్లలు, పెద్దలను కలిపి దాదాపు 15 వేల మందిపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి మెరుగైన ఫలితాలు సాధించామని చెబుతున్నారు వైద్యులు.

6 నెలల పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఈ వ్యాక్సిన్‌ వాడొచ్చని.. దాదాపు 25 మైక్రోగ్రాముల డోసుతో టైఫాయిడ్‌కు దూరం కావొచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో డోసుకు రూ.1,500 వరకు ఖర్చు చేస్తుందని.. వాడకం పెరిగిన కొద్దీ ధరలు తగ్గుతాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహాలిచ్చే నిపుణుల బృందం కూడా ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. జనాభా మొత్తానికి వేర్వేరు వ్యాధుల నుంచి టీకాల ద్వారా రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ‘గావీ’సంస్థ వచ్చే ఏడాది దాదాపు 8.5 కోట్ల డాలర్లతో టైఫాయిడ్‌ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు భారత్‌ బయోటెక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్, టైఫాయిడ్‌ వ్యాక్సిన్‌ కన్సార్షియం, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, పాథ్, గేట్స్‌ ఫౌండేషన్‌ల భాగస్వామ్యంతో నేపాల్, మలావీ, బంగ్లాదేశ్‌లలో ఈ వ్యాక్సిన్‌పై మరిన్ని పరీక్షలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు డాక్టర్ కృష్ణ ఎల్లా.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: