Connect with us

Movie News

కిరాక్ పార్టీ మూవీ ట్రైలర్: సీనియర్స్‌నే కుమ్మేస్తున్నాడు!

Published

on

రోజు రోజుకూ సీనియర్స్ అరాచకాలు ఎక్కువైపోతున్నాయ్.. మన దెబ్బకు సీనియర్స్ అబ్బా అనాలి, రండ్రా సీనియర్స్’ అంటూ సవాల్ చేస్తున్నాడు హీరో నిఖిల్. క‌న్న‌డంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ‘కిరిక్ పార్టీ’.. తెలుగులో ‘కిరాక్ పార్టీ’ పేరుతో తెలుగులో నిఖిల్ రీమేక్ చేస్తున్నాడు. వైవిధ్యమైన స్ట్రైట్ మూవీలు చేస్తూ వచ్చిన ఈ హీరో ఇప్పుడు బాణీ మార్చి రీమేక్‌ను చేపట్టాడు. నిఖిల్‌, సంయుక్తా హెగ్డే, సిమ్ర‌న్ ప‌రీంజా హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ మూవీకి శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్‌ను విడుద‌ల చేశారు.

కళాశాల రాజ‌కీయాల నేప‌థ్యంలో సాగే ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో నిఖిల్ జూనియర్ స్టూడెంట్స్‌కి లీడర్‌గా అదరగొట్టేస్తున్నాడు. అంజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా ఉంది. ఇక ఈ మూవీ ‘స్వామిరారా’ డైరెక్టర్ సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. ‘కార్తికేయ’ డైరెక్టర్ చందూ మొండేటి మాటలను అందిస్తుండటం మరో విశేషం. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Latest News

Trending

%d bloggers like this: