Connect with us

Technology

SBI ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న కొత్త రూల్స్

Published

on

భారతీయ స్టేట్ బ్యాంకు లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. 1806లో కోల్‌కతలో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ మరియు ప్రవాస భారతీయ సేవలను అందిస్తుంది.

ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆఫీసులో ఉద్యోగుల ప్ర‌వ‌ర్త‌న, అల‌వాట్ల గురించి కొత్త ఆదేశాలు జారీచేసింది. ఇందులో ఆఫీసులు తేన్పులు తీయ‌డాన్ని నిషేధించింది. ముఖ్యంగా స‌మావేశాలు జ‌రుగుతున్న‌పుడు, అత్య‌వ‌స‌ర ప‌నుల్లో ఉన్న‌పుడు తేన్పులు తీయ‌కూడ‌ద‌ని ఆదేశించింది. ఇలా చేయ‌డం వ‌ల్ల వినియోగ‌దారుల‌కు, స‌హోద్యోగుల‌కు చిరాకు క‌లిగి ప‌ని మీద దృష్టిసారించ‌లేక‌పోతున్నార‌ని స‌ర్క్యుల‌ర్‌లో వ్యాఖ్యానించింది.

ఫ్రంట్ ఆఫీస్‌లో ప‌నిచేసే వారు, ఒకే గ‌దిలో ఇతర ఉద్యోగుల మ‌ధ్య ప‌నిచేసేవారు, క‌స్ట‌మ‌ర్ కేర్ డెస్క్‌లో ప‌నిచేసేవారు గ‌ట్టిగా తేన్పులు తీయ‌డం అమ‌ర్యాద‌క చర్య‌. ఎక్కువ‌గా తినడం, అల‌స‌ట వంటి కార‌ణాల వ‌ల్ల తేన్పులు వ‌స్తుంటాయి.వీలైనంత మేర‌కు త‌క్కువ శ‌బ్దంతో తేన్పులు తీయాలి. ఎక్కువ శ‌బ్దంతో మాటిమాటికి తేన్పులు తీయ‌డం వ‌ల్ల ఇత‌ర ఉద్యోగుల‌కు ఇబ్బందిగా ఉంటుంద‌ని ఎస్‌బీఐ గ్ర‌హించి, ఈ ఆదేశాలు తీసుకువ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

దీంతో పాటు టీ ష‌ర్టులు, జీన్స్‌, స్పోర్ట్స్ షూస్ వేసుకురావ‌డంపై కూడా ఎస్‌బీఐ నిషేధం విధించింది. 13,000ల దేశీయ శాఖ‌ల్లో, 190 అంత‌ర్జాతీయ శాఖ‌ల్లోని దాదాపు 2,68,705 ఉద్యోగుల‌కు ఈ ఆదేశాల‌ను ఎస్‌బీఐ జారీచేసింది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేసే సీనియ‌ర్ పురుష ఉద్యోగులు, క‌స్ట‌మ‌ర్ల‌ను క‌లిసిన‌పుడు సెమీ-ఫార్మ‌ల్ ధ‌రించి, టై క‌ట్టుకోవాల‌ని సూచించింది. సీనియ‌ర్ మ‌హిళా ఉద్యోగులు ఫార్మ‌ల్ భార‌తీయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో గానీ, ఫార్మ‌ల్ పాశ్చాత్య వ‌స్త్ర‌ధార‌ణ‌లో గానీ ఉండాల‌ని పేర్కొంది.

Technology

టీ20 సిక్సర్ల వీరుల్లో రోహిత్ శర్మనే టాప్

Published

on

కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఎట్టకేలకి ఫామ్‌ అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (89: 61 బంతుల్లో 5×4, 5×6) అర్ధశతకం బాదడంతో 17 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు టోర్నీ ఫైనల్‌కి చేరింది.

భారత్ తరఫున ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా యువరాజ్ సింగ్ 74 సిక్సర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.రీసెంట్ గా రోహిత్ శర్మ 75 సిక్సర్లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా (54 సిక్సర్లు), మహేంద్రసింగ్ ధోని (46), విరాట్ కోహ్లి (41) టాప్-5లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి లీగ్ దశ చివరి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ జట్టు ఫైనల్ ఆడనుంది.

Continue Reading

Technology

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

Published

on

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం కేంబ్రిడ్జిలోని అయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సరిగ్గా గెలీలియో మరణించిన 300 ఏళ్ల తర్వాత.. 1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లాండ్‌లో జన్మించారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన అనేక పరిశోధనలు చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. వ్యాధి కారణంగా క్రమంగా పక్షవాతానికి గురైన ఆయన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. కదల్లేని స్థితిలోనూ విశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే చాలా పరిశోధనలు చేశారు.

దశాబ్దాలుగా కంప్యూటర్ సహాయంతోనే హ్యాకింగ్ సైగలను మాటలుగా మార్చి అర్థం చేసుకుంటున్నారు. శరీరం సహకరించని స్థితిలోనూ కృష్ణ బిలాలపై ఆయన చేసి పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా ఆయన సేవలందించారు.

1970 నుంచి హ్యాకింగ్ కృష్ణబిలాలపై పరిశోధనలు స్టార్ట్ చేసాడు. వ్యాధి ముప్పు వల్ల శరీరం రోజు రోజుకూ క్షీణిస్తున్నా.. అవిశ్రాంతంగా పరిశోధనలు జరిపి కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫై టైమ్’ అనే పుస్తక రచన మొదలుపెట్టారు. ఆ టైమ్ లోనే వ్యాధి కారణంగా మరుసటి ఏడాది వైద్య చికిత్స తీసుకున్నారు.

అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ రూపొందించుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో వెలువడింది. ‘కాలం కథ’ పేరుతో తెలుగులోనూ ఈ పుసక్తాన్ని తీసుకొచ్చారు.

Continue Reading

Political News

ఫస్ట్ టెస్టులో సచిన్ సహయం.. మర్చిపోలేని గంగూలీ

Published

on

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చాలా ఏళ్లపాటు కలిసి క్రికెట్ ఆడారు. వీరిద్దరూ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. చాలా ఏళ్లపాటు ఓపెనర్లుగా వీరిద్దరూ ఎన్నో అద్భుత భాగస్వామ్యాలను నెలకొల్పారు. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్న దాదా.. సచిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. గంగూలీ 1996లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా లాంగ్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు.

ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన దాదా.. ఆ ఘనత సాధించిన అతి కొద్ది మంది భారత క్రికెటర్ల సరసన నిలిచాడు. లార్డ్స్ టెస్టులో గంగూలీ శతకం సాధించిన వెంటనే 15 నిమిషాలపాటు టీ బ్రేక్ ఇచ్చారు. దాదా టీ తాగుదాం అనుకుంటుండగానే.. బ్యాట్‌ హ్యాండిల్ దగ్గర పగుళ్లు ఏర్పడటం చూసాడు.

దీంతో టేప్ అందుకుని బ్యాట్‌కు చుడుతుండగా.. సచిన్ గంగూలీ దగ్గరకు వచ్చాడట. నువ్వు టీ తాగుతూ బ్రేక్ తీసుకో. తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేయాలి కదా.. ఆ పని నేను చేస్తాలే అని చెప్పి దాదా బ్యాట్‌కు టేప్ చుట్టాడట.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: