Connect with us

Movie Reviews

అ! మూవీ ఆడియన్స్ ట్విట్టర్ రివ్యూ: బాగుంది కానీ.!

Published

on

ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌లోని టాలెంట్‌ను చూసి అతని కథ కోసం హీరో నాని స్వయంగా నిర్మాతగా మారాడు. వాల్ పోస్టర్ అనే బ్యానర్‌ను ఏర్పాటుచేసి మూవీ తీసేశాడు. ఇప్పటి వరకు విభిన్న కథలు ఎంచుకుంటూ మూవీస్ చేస్తున్న నాని. ఇప్పుడో వైవిధ్యమైన కథతో నిర్మాతగా మొదటి సినిమాను తీశాడు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘అ!’. నిత్యా మీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈమూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నాని నిర్మాత అనగానే ఈ మూవీపై అందరికీ ఆసక్తి పెరిగింది. దీనికి తోడు ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌లు మూవీకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. మూవీ ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు వెయిట్ చేసేంతగా ఈ మూవీకి ప్రచారం కల్పించారు. మొత్తానికి ప్రేక్షకుల అంచనాలను అందుకునే విధంగా ‘అ!’ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. హైదరాబాద్‌లోనూ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా మూవీను ప్రదర్శించారు. అందరి నోట ఒకటే మాట. ‘మూవీ సూపర్ గా ఉంది. నాని నిజంగా ఇంటిలిజెంట్ అని అందరు అంటున్నారు.

 

ఇదొక సైన్స్ ఫిక్షన్. కానీ అన్ని భావోద్వేగాలు ఉన్నాయట. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను ప్రస్తావించారట. చెట్ల వల్ల మనకు కలిగే ఉపయోగాలు తదితర అంశాలను మూవీలో ప్రధాన అంశాలుగా చూపించారట. ముఖ్యంగా బోన్సాయి చెట్టుకు వాయిస్ ఓవర్ చెప్పిన రవితేజ నవ్విస్తూనే మొక్కల ప్రాధాన్యతను వివరించిన తీరు అమోఘమని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు, సెకండ్ హాఫ్‌లో అసలు కథలోకి వెళ్లాడట. ఇక అక్కడి నుంచి మూవీ స్థాయి పెరిగిపోయిందని టాక్.

క్లైమాక్స్ అయితే చాలా బాగుందని అంటున్నారు. దర్శకుడు కథ, కథనాలతో కట్టిపడేశారట. అయితే ఇలాంటి మూవీ బి, సి సెంటర్లలో ఆడటం కష్టమే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సినిమా అద్భుతంగా ఉన్నా అది మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుందని అంటున్నారు. మాస్ ప్రేక్షకులు ఈ మూవీను పెద్దగా ఆదరించరని టాక్. మరి నాని ప్రొడక్షన్ నుంచి వచ్చిన మొదటి మూవీ బాక్సాఫీసు వద్ద కాసులు కురిపిస్తుందో.. లేదో.. చూడాలి మరి.

Latest News

Trending

%d bloggers like this: