Connect with us

Movie News

నాగశౌర్య అమ్మమ్మగారిల్లు మూవీ టీజర్

Published

on

కజిన్స్ ఇంటికి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినా ఎక్కువ సేపు ఉండలేం.. తిరిగి వచ్చేయాలనిపిస్తుంది.. కాని ఒక్క అమ్మమ్మ ఇంటికి మాత్రం వెళ్తే తిరిగిరావాలనిపించదు’ అంటూ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ ‘అమ్మమ్మగారిల్లు’ టీజర్‌తో వచ్చేశాడు నాగశౌర్య. ‘ఛలో’మూవీతో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య అదే జోష్‌ను ‘అమ్మమ్మగారింట్లో’ కంటిన్యూ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.

నాగశౌర్య, బేబి షామిలి జంటగా.. స్వాజిత్ మూవీస్ బ్యానర్‌లో కె.ఆర్, రాజేష్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘అమ్మమ్మగారిల్లు’. సుంద‌ర్ సూర్య ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ‘అమ్మమ్మగారిల్లు’ టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ నిన్న సాయంత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ టీజ‌ర్‌ను ఆవిష్క‌రించి యూనిట్‌కి శుభాకాంక్షల్ని అందించారు.

‘అమ్మ‌మ్మ‌గారిల్లు ఒక గుడిలాంటింది. గుడికి వెళ్లిన‌ప్పుడు శ‌త్రువులు ఎదురైనా ద‌ర్శ‌నం చేసుకుని వ‌స్తాంగానీ..అలాంటి చోట త‌గాదాలు ప‌డం. అలాగే అమ్మ‌మ్మ‌గారి ఇంటికెళ్లిన‌ప్పుడు కుటుంబంలో వ్య‌క్తుల మ‌ధ్య‌ మ‌నస్ఫ‌ర్ధ‌లున్నా బ‌య‌ట‌కి న‌వ్వుతూ ఉంటాం. కార‌ణం అమ్మ‌మ్మ బాధ‌ప‌డ‌కూడ‌ద‌ని. అలాంటి క్యారెక్టర్స్ తో షూట్ చేసిన మూవీ ఇది’ అంటూ హీరో నాగశైర్య అమ్మమ్మగారిల్లి గొప్పతనాన్ని చెప్పుకొస్తున్నాడు.

ఇక టీజర్‌లో అమ్మమ్మ కోసం ఏమైనా చేసే మనవడిగా నాగశౌర్య ఎమోషన్‌ని బాగా పండిస్తున్నాడు. రావు రమేష్, షకలక శంకర్, శివాజీరాజా, పోసాని కీలక పాత్రలో నటిస్తుండగా.. సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Latest News

Trending

%d bloggers like this: