Connect with us

Political News

భారత జట్టులోకి కోహ్లీని నేను వద్దని చెప్పనా?

Published

on

విరాట్ కోహ్లీని భారత జట్టులోకి 2008లో ఎంపిక చేయడాన్ని తాను వ్యతిరేకించిన మాట అవాస్తవమని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ చెప్పాడు. రెండు రోజుల క్రితం టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌ సర్కార్ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లిని జట్టులోకి ఎంపిక చేయడం అప్పట్లో బీసీసీఐ కోశాధికారిగా ఉన్న శ్రీనివాసన్‌తో పాటు మహేంద్రసింగ్ ధోని, కోచ్ గ్యారీ కిరిస్టన్‌కి ఇష్టంలేదని.. వారు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, తమిళనాడుకి చెందిన బద్రీనాథ్‌ని జట్టులోకి తీసుకోవాలని పట్టుబట్టినట్లు చెప్పాడు. వారి ప్రతిపాదనని లెక్క చేయకుండా కోహ్లీకి అవకాశమిచ్చినందుకు తనని చీఫ్ సెలక్టర్ పదవి నుంచి శ్రీనివాసన్ అప్పట్లో తప్పించాడని వెంగ్ సర్కార్ చెప్పాడు. దీనిపై తాజాగా శ్రీనివాసన్ చెప్పాడు.

2008లో జరిగిపోయిన విషయాన్ని వెంగ్ సర్కార్ ఇప్పుడు ప్రస్తావించడం సంస్కారం కాదు. జట్టు ఎంపికలో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. విరాట్ కోహ్లీని ఎంపిక చేయడం వల్లే అతని చీఫ్ సెలక్టర్ పదవి పోయిందనడంలో నిజం లేదు. అప్పట్లో అతను ముంబయి క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా వెళ్లేందుకు ఆసక్తి కనబర్చాడు. అందుకే అతడ్ని సెలక్షన్ కమిటీలోకి తీసుకోలేదు. బద్రీనాథ్‌ని పక్కన పెట్టడం వల్లే పదవి పోయిందుంటున్నా..? శ్రీలంక పర్యటన కోసం విరాట్ కోహ్లితో పాటు బద్రీనాథ్‌ని కూడా సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం ఇక్కడ వెంగ్ సర్కార్ మరిచిపోయినట్లున్నాడు’ అని శ్రీనివాసన్ కోపంగా స్పందించాడు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Movie News

రేయ్.. చివరకు మిగిలేది ఆరడుగుల నేల,గుప్పెడు బూడిదే

Published

on

నారు నాటితే వరి పెరుగుతుంది.. మాట జారితే గొడవ పెరుగుతుంది’.. పెదరాయుడు మూవీలో మోహన్ బాబు చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కరెక్ట్‌గా సరిపోతుంది. హోదా ఇస్తాం అని చెప్పి బీజేపీ నోరు జారడం. ప్యాకేజీ ముద్దు అంటూ టీడీపీ ఊకొట్టడం లాంటి నోరుజారిన మాటలు ఏపీలో గొడవలకు దారితీశాయి. ఈ డైలాగ్‌కు కొనసాగింపుగా.. ‘అర్థం చేసుకునే వాళ్లకు చెప్పొచ్చు అన్నయ్యా.. అర్థం చేసుకోని వాళ్ల వాళ్లకు ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు’ అని మోహన్ బాబు సౌందర్యను ఉద్దేశించి అన్న డైలాగ్ కూడా బీజేపీకి అతికించినట్టు సరిపోతుంది. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ హోదా విషయంలో కేంద్రానికి ఎంత చెప్పిన చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు అర్థం కానట్టే వ్యవహరిస్తోంది. ఈ గొడవను పక్కనపెడితే.. రీసెంట్ రాజకీయ పరిస్థితులపై నాకెందులే అని పక్కకు తప్పుకునే స్వభావం లేని మోహన్ బాబు సమయం వచ్చినప్పుడు కౌంటర్లు పేలుస్తూనే ఉంటారు. రీసెంట్ గా ఆయన ట్విట్టర్‌ పెట్టి పోస్టు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సామాజిక రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేయడం అలవాటుగా చేసుకున్న మోహన్ బాబు.. ‘మనిషికి ఉన్నది ఒకే ఒక పొట్ట.. దానికి కావలసింది రెండు పూట్లా తిండి. కానీ మీరు మీ బిడ్డలకు, బిడ్డల బిడ్డలకూ కావలసినంత దోచుకుని.. దేశంలో బ్యాంకులు చాలక స్విస్ బ్యాంకుల్లో దేశ సంపదని దాచిపెట్టుకుంటున్నారు. రేయ్.. ఎంత సంపాదించినా చివరకు మిగిలేది ఆరడుగుల నేల,గుప్పెడు బూడిద’ అంటూ ట్విట్టర్‌లో పేల్చిన పొలిటికల్ పంచ్‌లు తగలాల్సిన వాళ్లకు గట్టిగానే తగులుతున్నాయి.

Continue Reading

Movie News

తెలంగాణ రాజకీయాల్లోకి రానున్న జూనియర్ త్రిష

Published

on

ఈ రోజుల్లో’ మూవీతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగమ్మాయి రేష్మ రాథోర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతుంది. ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకుని జూనియర్ త్రిషగా పేరు సంపాదించుకుంది ఈ తెలంగాణ అమ్మాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘జై శ్రీరామ్, లవ్ సైకిల్, ప్రతిఘటన, అప్పవమ్ వీన్‌జుమ్ (మలయాళం), అధాగప్పట్టత్తు మగజనన్‌గలై (తమిళ్) మూవీలతో బాగానే అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆమధ్య ఒక ఐటెం సాంగ్‌లోనూ తళుక్కున మెరిసింది ఈ ముద్దగుమ్మ.

అయితే ఒకవైపు మూవీలతో బిజీగా ఉన్నా తనకు సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం అని అందుకే రాజకీయాల్లోకి రావాలని ఉందంటూ మనసులోకి కోరికను బయటపెట్టింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేష్మ రాథోర్ షూటింగ్ గ్యాప్ దొరకడంతో సొంత జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనకు రాజకీయాలు అంటే ఇష్టం అని ఇక్కడి ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వచ్చి సేవచేస్తా అన్నారు.

రానున్న రోజుల్లో ఖచ్చితంగా తన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని తెలంగాణ రాష్ట్రం నుండి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరతారో క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ ఓ జాతీయ పార్టీలో చేరతానంటూ హింట్ ఇచ్చారు రేష్మ రాథోర్.

Continue Reading

Movie News

కాంగ్రెస్ టికెట్ కోసం హీరోయిన్ రమ్య తల్లి పోరు!

Published

on

తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మండ్యా టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ను డిమాండ్ చేస్తోంది నటి రమ్య తల్లి రంజిత. ఈ మేరకు ఆమె తన డిమాండ్ ను బయట పెట్టింది. తను, తన కూతురు పార్టీకి ఎన్నో సేవలు చేస్తున్నామని.. ఈ నేఫథ్యంలో తనకు ఎమ్మెల్యే టికెట్ ను ఇచ్చి, తన కూతురుకు కర్ణాటక రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధిపతిగా ఉన్నారు రమ్య. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రమ్య తల్లి డిమాండ్ ఆసక్తిదాయకంగా మారింది.

గతంలో రమ్య మండ్యాకు ఎంపీగా వ్యవహరించారు. ఈ సీటుకు ఉప ఎన్నిక రాగా.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచింది రమ్య. అయితే రెండో సారి.. అక్కడ నుంచినే ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైంది ఈ హీరోయిన్. ప్రస్తుతం ఢిల్లీలో సోషల్ మీడియా విభాగంలో ఆమె పని చేస్తూ ఉన్నారు. రమ్య తల్లి తనకు ఎమ్మెల్యే టికెట్ అనే డిమాండ్ చేస్తున్నారు. తనకు అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా రెడీ అని రంజిత స్పష్టం చేశారు.

అయితే తల్లి డిమాండ్ పై రమ్య స్పందించడం లేదు. మండ్యా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న తల్లి రంజిత డిమాండ్ పై స్పందించడానికి రమ్య నిరాకరించింది. అలాగే తనకు పార్టీ పదవిని ఇవ్వాలన్న తల్లి డిమాండ్ పై కూడా రమ్య స్పందించలేదు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: