Connect with us

Health

భార్య ఎక్సరే చూడగానే షాక్ కి గురయిన భర్త

Published

on

shayara exray

32 సంవత్సరాలుగా ఆమె ఎంతో నొప్పిని భరిస్తూ బ్రతికిందో. చూడడానికి మంచిగా ఉన్న, లోప‌ల ఏదో ఒక నొప్పి అని ఎప్పుడూ భ‌ర్త‌కు, బంధువుల‌కు చెప్పేది. అయితే ఆమె బాధను ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఆమెకు అంద‌రూ పిచ్చి పట్టిందని అనుకున్నారు.తాను వైద్యులను కలిసింది.. కానీ వారు ఆమెకు ఏమైందో కనిపెట్టలేకపోయారు. ఆమె రిపోర్ట్ ను చూసి ఏ డాక్టర్ కి కూడా అర్ధం కాలేదు. అయితే చివరికి ఇప్పుడు ఆమెకు ఎక్స్ రే తీసి చూడగా అసలు నిజం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఆమె భర్త షాక్ అయ్యాడు. ఇంత‌కు ఆమె శ‌రీరంలో ఏమున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. 22 సూదులు ఆమె శ‌రీరంలో ఉన్నట్లు తెలిసింది.

ఆమె శరీరంలోకి అన్ని సూదులు ఎప్పుడు ఎలా వచ్చాయా అన్న సంగతి ఎవరికీ కూడా అర్దం కావ‌డం లేదు. దాదాపు 32 సంవత్సరాలుగా ఆమె ఇలాంటి బాధతో బ్రతుకుతుంది. ఈ ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని గోరఖ్ పూర్ కు చెందిన షాయరా అనే మహిళ జీవితంలో జరిగింది. షాయరా, ఎహసాన్ అలీతో 1985లో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. అయితే ఆమెకు అప్పటి నుండి తనకు ఏదో అవుతోంది అని.. శరీరంలో ఏదో నొప్పిగా ఉందని ఎప్పుడూ చెబుతూ ఉండేది.దీంతో 1986 నుండి 2008 వరకూ చాలా హాసిపిటల్స్ కి తీసుకొళ్లి చూపించాడు ఆమె భర్త. చాలా మంది ఆమెకు మైండ్ సరిగా పనిచేయడం లేదని చెప్పారు. ఆ త‌ర్వాత ఆమె గోరఖ్ పూర్ లోనూ, ఢిల్లీలోనూ డాక్టర్ లను  సంప్రదించింది.. కానీ వారు ఆమెకు ఏమైందో గుర్తించలేకపోయారు. ఆ త‌ర్వాత 2008లో ఢిల్లీ లోని ఎయిమ్స్ కు కూడా తీసుకుని చూపించారు.

ఆమె రిపోర్ట్ ను చూసి ఏ డాక్టర్ కూడా ఆమె బాధని గుర్తించలేకపోయారు. అయితే ఇప్పుడు వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీసి చూడగా ఆమె శరీరం నుండి కొన్ని సూదులు బయటకు వచ్చాయి. ఆమె శరీరం లో 22 సూదులు ఉన్నట్లు తెలిసింది. దీంతో వైద్యులు ఆమెకు ఎలా వైద్యం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఆమె శరీరంలోని చాలా భాగాలలో ఈ సూదులు ఉండడంతో ఎలా లోపలికి  వెళ్ళాయా అన్న విషయం గురించి ఎంత ఆలోచించిన  వాళ్ళకి అంతు చిక్కడం లేదు.32 సంవ‌త్స‌రాల నుంచి ఆమెబాధపడుతూనే ఉంది. ఇది చూసిన ఆమె భ‌ర్త‌, డాక్ట‌ర్లు షాక్ కి గురి అయ్యారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: