Connect with us

Movie News

పూనమ్‌ని కత్తి టార్గెట్ చేయడం వెనుక రహస్యం ఏంటో తెలుసా

Published

on

తాజాగా పూనమ్‌కౌర్‌పై కత్తి మహేష్ సంధించిన ప్రశ్నల మీద తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నల సందర్భంగా కత్తి మహేష్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పూనమ్ ఆత్మహత్యకు యత్నించారు. ఆమె చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రహస్యంగా చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి ఫీజులు ఎవరు కట్టారు’’ అనే ప్రశ్నలు మహేష్ వేశారు. అయితే పూనమ్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు మీడియాలో ఎలాంటి వార్త వినబడలేదు.

‘‘పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న ఆసుపత్రి ఏది? ఆ బిల్స్ కట్టింది ఎవరు? డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం’’ అంటూ ఇలా మొత్తంగా పూనమ్‌కౌర్‌పై కత్తి మహేష్ ఆరు ప్రశ్నలు వేశారు. ఈ ఆరు ప్రశ్నలపై సినీ ప్రముఖుల్లో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

పూనమ్‌కౌర్ ఇటీవల తనపై చేసిన ట్వీట్ నేపథ్యంలో ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నానని కత్తి చెప్పుకొచ్చారు. తాను చేసిన ఆరోపణలు తప్పు అని భావిస్తే తక్షణమే పూనమ్ ప్రెస్‌మీట్ పెట్టి ఖండించాలని ఆయన అన్నారు.

ఒకవేళ అవి అబద్ధాలని భావిస్తే.. తగిన ఆధారాలు చూపించాలని ఆమెకు చెప్పారు. ‘‘పూనమ్, పవన్‌కు పరిచయమా? ఆ పరిచయం ఎంతవరకు? పవన్‌కల్యాణ్, పూనమ్ మధ్య ఏం జరిగింది?’’ అంటూ కత్తి చేసిన ఆరోపణలు ఎవరికీ అర్థంకావడం లేదు. అసలు పూనమ్‌ను కత్తి ఎందుకు ఒక్కసారి తెరమీదకు తెచ్చారు..? పూనమ్‌ను మహేష్ వ్యూహాత్మకమైన ప్లాన్ ఏమైనా ఉందా అనే సందేహాలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం వల్ల పవన్‌ అభిమానులు నుంచి కానీ, జనసేన కార్యాలయం నుంచి ఏమైనా స్పందన వస్తుందా అనే ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేసినట్లు సినీ వర్గాలు భావిస్తున్నారు.

ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ క్షుద్రపూజలు చేశారని, తన వద్ద వీడియో సాక్ష్యం ఉందని ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ సంచలన విషయాలు చెప్పారు. ‘టీవీ9’ లైవ్ ప్రోగ్రామ్ లో కత్తి మహేశ్ మాట్లాడుతూ, ‘ప్రజా జీవితంలో ఉన్న పవన్ కల్యాణ్ గురించి చాలా భ్రమలు ఉన్నాయి. ఆ భ్రమలు కొన్ని నిజాలు కావు అని చెప్పడం నా ఉద్దేశం. పవన్ కల్యాణ్ దేవుడని, ప్రజా సేవ చేసేస్తున్నాడని భావించే వాళ్లకు అతనిలో ఉన్న మరో పార్శ్వం తెలియదు. ఆ మరో పార్శ్వాన్ని నేను కనుగొన్నాను. అతను హీరో అయితే ఏంటి? ప్రశ్నించకూడదా అనే ఆలోచన రావాలి, మద్దతు పలకాలి. కానీ, అలాంటిది ఏమి జరగడం లేదు.

నాకు అర్థమైందేమిటంటే, మనందరం బానిసబతుకులు బతుకుతూ చాలా సుఖంగా ఉన్నాం. పవన్, త్రివిక్రమ్ క్షుద్ర పూజలు చేయడానికి వాళ్ల కారణాలు వాళ్లకు ఉండొచ్చు. విజువల్ గా నేను చూసిందైతే పూజలు.. కొన్ని తాంత్రిక విధానాల్లో ఈ పూజలు చేశారు. ఆ పూజలు చేసిన పూజారి పేరు నరసింహ. ఆ పూజలు ఎక్కడ చేశారో నాకు తెలియదు. ఈ పూజారి ఎవరనే విషయమై ‘టీవీ9’ ఆరా తీస్తే… అన్ని విషయాలు బయటకు వస్తాయి అంటూ లైవ్ లో సంచలనమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

Latest News

Trending

%d bloggers like this: