Connect with us

Movie News

లైవ్ షో నుండి పారిపోయిన కత్తి మహేష్

Published

on

ప్రతిసారి పవన్‌కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించే కత్తి మహేష్ అంటేనే పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇటీవల పవన్‌కు మద్దతుగా కత్తిపై హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. దీంతో కత్తి మహేష్‌ పవన్, పూనమ్ కౌర్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తనతో చర్చకు రావాలని సవాల్ విసిరాడు. అయితే కత్తి సవాలును పూనమ్, పవన్ పట్టించుకోలేదు. అంతే…. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌ వేధికగా కత్తి మహేష్ మరోసారి పవన్‌పై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని, తాను పది ప్రశ్నలు వేస్తే, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని కత్తి మహేష్ చెప్పుకొచ్చారు. తన తల్లిని, భార్యను నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతుంటే తాను చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు కత్తి.

తనను సామాజిక బహిష్కరణ చేయాలని కోన వెంకట్ చేసిన డిమాండును ప్రస్తావిస్తూ, ఓ దళితుడిగా తాను ఎన్నోసార్లు సామాజిక బహిష్కరణను చూశానని, సినీ ఇండస్ట్రీ నుంచి కూడా బహిష్కరించారని పేర్కొన్నారు. ముందు చెప్పినట్టుగానే తాను వచ్చేశానని, పవన్, పూనమ్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు. కానీ వాళ్లిద్దరూ రాలేదని.. తాను చెప్పలనుకున్న విషయాన్ని చెప్తానని.. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనని స్పష్టం చేశారు. తన వెనుక ఏ రాజకీయ అస్తం లేదని కత్తి వెల్లడించారు.

తాజాగా పూనమ్‌కౌర్‌పై కత్తి మహేష్ సంధించిన ప్రశ్నల మీద తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నల సందర్భంగా కత్తి మహేష్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పూనమ్ ఆత్మహత్యకు యత్నించారు. ఆమె చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రహస్యంగా చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి ఫీజులు ఎవరు కట్టారు’’ అనే ప్రశ్నలు మహేష్ వేశారు. అయితే పూనమ్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు మీడియాలో ఎలాంటి వార్త వినబడలేదు. పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న ఆసుపత్రి ఏది? ఆ బిల్స్ కట్టింది ఎవరు? డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం’’ అంటూ ఇలా మొత్తంగా పూనమ్‌కౌర్‌పై కత్తి మహేష్ ఆరు ప్రశ్నలు వేశారు. ఈ ఆరు ప్రశ్నలపై సినీ వర్గాల్లో ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి.

ఈ క్రమంలోనే మహా న్యూస్ ఛానల్ కి వెళ్లాడు కత్తి మహేష్. పూనమ్‌కౌర్‌పై కత్తి మహేష్ సంధించిన ప్రశ్నల మీద తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇదే ఇషం గురించి వచ్చిన డైరెక్టర్ వివేక్ అడిగిన ప్రశ్నకు కత్తి సమాధానం చెప్పకుండానే లేచి కోపంగా వెళ్లిపోయారు. అసలు డైరెక్టర్ వివేక్ ఏమడిగారంటే.. మీ అమ్మ‌గారి గురించి ఒక రెండు నిముషాలు చెప్పండి అని క‌త్తి మ‌హేష్ ని అడిగారు. దానికి స్పందించిన క‌త్తి మ‌హేష్ మా త‌ల్లి గురించి బ‌హిరంగంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని సమాధానం చెప్పారు. మీరు మీ అమ్మ గురించి చెప్పాల్సిన అవసరం లేనప్పుడు పూనమ్ వ్యక్తిగత విషయాలు అడిగే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు.

నేను మా అమ్మ గురించి మాట్లాడడం వ్యక్తిగతమని మహేష్ చెప్పినప్పటికీ డైరెక్టర్ వివేక్ వినిపించుకోకపోవడంతో ఆయన ఛానల్ చర్చా కార్యక్రమం లైవ్ లోనుంచి కోపంగా వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోపై నెటిజ‌న్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంద‌రు క‌త్తి మ‌హేష్ ను వ్య‌తిరేకిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు వివేక్ అలా త‌ల్లి గురించి మాట్లాడ‌టం స‌రికాదంటున్నారు.

 

Latest News

Trending

%d bloggers like this: