Connect with us

Political News

పవన్ ఫ్యాన్స్ కి ఏడు ప్రశ్నలకు సమాదానాలు చెప్పిన కత్తి

Published

on

జవనరి 15 వరకూ సైలెంట్‌గా ఉండమన్న కోన వెంకట్ సూచన మేరకు పవన్ కళ్యాణ్‌పై ఎలాంటి ఆరోపణలు చేయలేదని. కానీ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని కత్తి మహేష్ చెప్పాడు. మా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేశారని పవన్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశాడు. కత్తికి ఏడు ప్రశ్నలంటూ పవన్ ఫ్యాన్స్‌ సంధించిన ప్రశ్నలకు మూవీ క్రిటిక్ బదులిచ్చాడు.

1. తన కుటుంబం ఎవరినీ ఎలాంటి మోసం చేయలేదని కత్తి చెప్పాడు.

2. నీ తండ్రి వ్యవసాయ అధికారిగా ఎన్ని కోట్లు మింగాడన్న ప్రశ్నకు బదులిస్తూ. ఆయన ఉద్యోగ విరమణ చేశాక వచ్చిన సొమ్ముతో మా ఊళ్లోనే, మాకున్న కొద్ది పాటి స్థలంలో ఇల్లు క‌ట్టుకున్నారు. ఆయన కోట్లు మింగారనేది అబద్దం అని కత్తి బదులిచ్చాడు.

3 . నీ కుటుంబం గ్రామానికి ఎందుకు రాదనే ప్రశ్నకు బదులుగా. మా ఫ్యామిలీ మా ఊళ్లోనే ఉంటోంది.

4 . బిగ్ బాస్ షోలో తన ఎంట్రీ కోసం వైఎస్సార్‌సీసీ నేత అంబటి రాంబాబు తనకు సహకరించలేదని స్పష్టం చేశాడు. ముంబైకి చెందిన టీం 80 మందిని ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని ఎంపిక చేసింది. దానికి, అంబటికి సంబంధం ఏంటని పవన్ ఫ్యాన్స్‌ను కత్తి ప్రశ్నించాడు.

5 . ప‌వ‌న్‌ని టార్గెట్ చేసినందుకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ముట్టజెప్పిందనే ప్రశ్నకు బదులిస్తూ. నా కోసం నేను పోరాడుతున్నా. నా ఆత్మ‌గౌర‌వం కోసం ప్ర‌శ్నిస్తోంటే జగన్ పార్టీ నా వెనుక ఉందని తప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న ఫ్యాన్స్ సామాజిక విధ్వంసకారులుగా త‌యార‌య్యారని కత్తి చెప్పాడు.

6 . ఐదో ప్రశ్నకు బదులిస్తూ. మా అమ్మ ఎప్పుడూ చిట్టీలు వేయలేదని కత్తి స్పష్టం చేశాడు. ఆమె కేన‌్సర్‌తో రెండేళ్ల క్రితం చనిపోయిందని చెప్పాడు.

7 . నీ సోదరి భర్తను బెదిరించి డబ్బులు గుంజడానికి ఎవరు సాయం చేశారనే ప్రశ్నకు బదులిస్తూ. మా బావ ఉద్యోగం చేస్తున్నాడు. నా సోద‌రి జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. న‌న్ను వ్యక్తిగతంగా దెబ్బతీయాల‌నే ఉద్దేశంతోనే నా కుటుంబంపై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారని కత్తి వాపోయాడు.

ఇటీవలే సంక్రాంతి పండుగ కోసం కత్తి సొంతూరు వెళ్లానని, మా నాన్న కూడా అదే ఊళ్లో ఉంటున్నారు. కాబట్టి మా కుటుంబం ఎలాంటి తప్పూ చేయకపోతే సంక్రాంతికి సొంతూరికి ఎందుకు వెళ్లననే ప్రశ్నే సరైందని కాదని చెప్పాడు.

Political News

అభిమానులూ ఇలా చేయండి అంటూ ట్వీట్స్ చేసిన పవన్ కళ్యాణ్

Published

on

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రోద్బలంతో నటి శ్రీరెడ్డి తన తల్లిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వరుస ట్వీట్లతో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పవన్.. టీవీ9, ఏబీఎన్, టీవీ5 అధినేతలపై నిప్పులు చెరిగారు. తన తల్లిపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తే.. వాటిని ఖండిచకుండా వ్యాపారానికి వాడుకున్నారని విమర్శించారు.

ఆ తర్వాత మెగా ఫ్యామిలితో కలిసి ఫిల్మ్ చాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి భారీ ఎత్తున చేరుకున్న అభిమానులు మీడియాపై ఆగ్రహంతో వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి పలు ప్రకటనలు చేశారు.

‘‘శ్రీనిరాజుకు టీవీ9లో పెట్టుబడులు ఉన్నాయి. అంతేకాదు, అతనికి సత్యం రామలింగరాజు, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కూడా సంబంధాలున్నాయి’’ అని పవన్ ట్వీట్ చేశారు.

‘‘శ్రీనిరాజు రేపు నా మీద పరవు నష్టం దావా వేయనున్నారు. జనసైనికులారా మీరెవ్వరూ ఆవేశపడొద్దు. ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడవద్దు. నేను కూడా ఆయా చానెళ్ల అధినేతలతో శక్తివంతమైన న్యాయపోరాటానికి రెడీ అవుతున్నాను. అని మరో ట్వీట్‌లో చెప్పారు.

బాయ్‌కాట్ టీవీ9, టీవీ5, ఏబీఎన్’:
‘‘మన తల్లులు, కూమార్తెలు, చెల్లెళ్లలను దుర్బషలాడుతున్న టీవీ9, టీవీ5, ఏబీఎన్‌లను బాయ్‌కట్ చేయండి. నిస్సహాయ సోదరి, నగ్నత్వం, అసభ్యతతో వ్యాపారం చేస్తున్న వాళ్లను సైతం మనం బాయ్‌కట్ చేయాలి’’ అని పవన్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.

Continue Reading

Movie News

పవన్ ఉగ్రరూపం: ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరసన, మీడియా వాహనాలు ద్వంసం

Published

on

తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి రేపిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ గొడవలో తనకు ఎలాంటి సంబధంలేకపోయినప్పటికీ.. తనను తన తల్లిని దూషించిన వారిపైన, వెనకునుండి ఈ కుట్రను జరిపిస్తున్నవారిపైన ట్విట్టర్ వేదికగా ప్రశ్నలను గుప్పిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు డైరెక్ట్‌గా యాక్షన్‌లోకి దిగారు.

ఇండస్ట్రీ పరువు తీసే విధంగా మీడియాలో ఇంత రాద్దాంతం జరుగుతుంటే పట్టించుకోకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ డైరెక్ట్‌గా ఫిల్మ్ ఛాంబర్‌కే వెళ్లారు పవన్. దాదాపు రెండు గంటల పాటు పవన్ ఛాంబర్‌లో మెగా ఫ్యామిలీ, ఇతర సినీప్రముఖులతో సమావేశం అయ్యారు. పవన్ ఫిల్మ్ ఛాంబర్‌కి వచ్చిన కొద్దినిమిషాల వ్యవధిలోనే మెగా బ్రదర్ నాగబాబుతో పాటు మెగా హీరోలు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఛాంబర్‌కి చేరుకోగానే పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అక్కడకు చేరుకున్నారు. పవన్ పవన్ కళ్యాణ్‌పై కుట్ర పూరితంగా కథనాలను ప్రసారం చేస్తున్న కొన్ని మీడియా ఛానల్స్ వాహనాలను ద్వంసం చేస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసుల విజ్ఞ‌ప్తి మేరకు పవన్ ఫిల్మ్ ఛాంబర్‌ను వీడారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతో ఎలాంటి చర్చలు జరిపారు. పవన్ డిమాండ్లు ఏంటి? మెగా హీరోలు మూకుమ్మడిగా ఎందుకు వచ్చారు? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలతో ఎలాంటి చర్చలు జరిపారు? పవన్ కళ్యాణ్ వెంట న్యాయ నిపుణులు రావడం తదితర అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు ఆయన దీక్షకు కూడా దిగుతారని వార్తలు వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆయన ఫ్యాన్స్ ప్రధాన కూడళ్లలో నిరసనలకు దిగారు. పవన్ కళ్యాణ్‌పైన కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. పవన్ తల్లికి బహిరంగం క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు. పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏం జరగబోతోందనే ఉత్కంఠగా మారింది.

Continue Reading

Political News

హ్యాపీ బర్త్ డే అమ్మా: భావోద్వేగ ట్వీట్ చేసిన మహేష్

Published

on

‘భరత్ అనే నేను’ మూవీ విడుదల సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ‘భరత్ అనే నేను’ మూవీ తనకు ఎంతో ప్రత్యేకమైనదని.. ఎందుకంటే ఈ మూవీ తన తల్లి జన్మదినం రోజున విడుదల కావడం చాలా ఆనందంగా ఉందంటూ ప్రేక్షకులతో తన అనుభూతిని పంచుకున్నారు.

ఈ సందర్భంగా మహేష్ తల్లి ఇందిర దేవి అపురూపమైన ఫోటోని ట్విట్టర్‌‌లో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే అమ్మా.. ‘భరత్ అనే నేను’ ఇన్ సినిమాస్ నౌ’.. ‘ఈ ప్రత్యేకమైన రోజున నా హృదయానికి దగ్గరైన మూవీను అందరి ముందుకు తీసుకురావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది అంటూ మహేష్ చేసిన ఎమోషనల్ ట్వీట్ ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంది. దీంతో మహేష్ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇందిర దేవి ఫోటోను విపరీతంగా షేర్ చేస్తుండటంతో వైరల్‌గా మారింది.

It is overwhelming for me to present a film so close to my heart on this special day. Happy Birthday, amma 🙂 🙂
Bharat Ane Nenu in cinemas now.  అని మహేష్ బాబు ట్వీట్ చేసాడు.

 

 

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: