Connect with us

Movie News

మహేష్ బాబు: అచ్చం మా అమ్మేలాగే ఉంది

Published

on

ప్రిన్స్ మహేష్ తన కూతుర్ని చూసి మురిసిపోతున్నారు. సితార ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. కూతురి ఫోటోను షేర్ చేసి… పింక్ గర్ల్ పవర్.. చూడటానికి అచ్చం మా అమ్మలాగే ఉందని పోస్ట్ చేశారు. అంతేకాదు హార్ట్ సింబల్స్‌ను కూడా ఉంచి.. తన ప్రేమను చాటుకున్నారు మహేష్ బాబు. ఈ పోస్ట్‌ను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోకు ఫ్యాన్స్ నుంచి లైక్స్ తెగ వస్తున్నాయి. మహేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పెట్టిన 16 గంటల్లోపే 1.10 లక్షల మంది లైక్‌ చేశారు. సితార సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవలే సితార భరత్ అను నేను సెట్స్‌లో సందడి చేసింది. హీరోయిన్ కైరా అద్వానీ సితారతో ఫోటో దిగి పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు కూడా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది.

Latest News

Trending

%d bloggers like this: