Connect with us

Movie News

మొదటి రోజు కలెక్షన్లు, రికార్డులు బ్రేక్ చేస్తున్న సీఎం

Published

on

ప్రిన్స్ మహేశ్ బాబు యాక్ట్ చేసిన ‘భరత్ అనే నేను’ మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో.. భారీ ఓపెనింగ్స్ దక్కాయి. గురువారమే అమెరికాలో భారీగా ప్రీమియర్ షోలు వేశారు. ఇండియాలో విడుదలకు ముందు రోజే అక్కడ 2000 షోలు ప్రదర్శించారు. ఓవర్సీస్‌లో మొదటి రోజే భరత్‌ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరినట్టు సమాచారం. దీంతో బాహుబలి తర్వాత మహేశ్ మూవీకి ఓవర్సీస్ ప్రీమియర్ షోల ద్వారా భారీ కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎం భరత్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహేశ్ బాబు కెరీర్లోనూ ‘భరత్ అనే నేను’ మూవీ భారీ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచిందని ట్రేడ్ అనలిస్ట్‌లు చెబుతున్నారు. ఈ మూవీ ఫస్ట్ రోజు రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని అంచనా. భరత్‌ తొలి రోజు రూ. 58 కోట్లు రాబట్టిందని ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్ట్ ఉమర్ సంధూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో నిర్మాతల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

‘భరత్ అనే నేను మెగా బ్లాక్ బస్టర్. ఇది మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 58 కోట్లు రాబట్టింది. మహేశ్ బాబు కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ వచ్చాయ’ని ఆయన ట్వీట్ చేశారు. కాగా ఈమూవీ థియేటరికల్ రైట్స్‌ రూ. 100 కోట్లకు అమ్ముడయ్యాయి.

Latest News

Trending

%d bloggers like this: