Connect with us

Movie News

రాత్రికి ఫ్రీనా అంటే.. చెప్పుతో కొడతానన్న మాధవిలత

Published

on

రెడీ.. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్!! సినిమాల్లో ఈ సౌండ్‌ వినపడాలన్నా.. కెమెరా ముందు కనిపించాలన్నా.. తెరవెనుక చాలా పెద్ద బాగోతం నడవాల్సిందే. హీరోయిన్స్ పరిస్థితి అయితే మరీ దారుణం. ఇక కొత్తగా రంగుల ప్రపంచ విహరించాలని కోటి ఆశలతో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టే కొత్త హీరోయిన్‌లను పడకసుఖాలకే పరిమితం చేస్తున్నారంటూ టాలీవుడ్‌లో జరుగుతున్న చీకటిబాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొన్న గాయత్రి గుప్త.. నిన్న శ్రీరెడ్డి.. నేడు మాధవి లత. ఇలా ఒక్కొక్కరుగా టాలీవుడ్‌లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ ( అవకాశాల పేరుతో వాడుకోవడం) గురించి చెబుతున్నారు.

నచ్చావులే’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మాధవి లత ఆ తరువాత మూడు నాలుగు మూవీస్ లో నటించింది. అయితే కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ దక్కకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. అయితే తెలుగు హీరోయిన్లను కావాలనే తొక్కేస్తున్నారని.. దర్శక, నిర్మాతలు చెప్పినట్లు వినాలని అప్పుడే ఆఫర్స్ వస్తాయంటూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆమె ఓపెన్ అయ్యింది.

తాను హీరోయిన్‌గా ప్రయత్నిస్తున్న టైం ఓ కోఆర్డినేటర్ ఫోన్ వచ్చింది. హీరోయిన్‌గా నటించేందుకు మంచి ఆఫర్ ఉంది. కాకపోతే చాలా కమిట్మెంట్‌తో ఉండాలని ముందుగా తనతో ఒక రాత్రి గడిపితే నీ ఫిగర్ గురించి నిర్మాతలకు చెబుతా అంటూ చాలా ఛండాలంగా మాట్లాడాడు. ఆ తరువాత నాకు విషయం అర్థమై అతని ఫోన్ కట్ చేశా అన్నారు. ఇక ఆ తరువాత ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని నిర్మాతలు, కోఆర్డినేటర్లు డైరెక్ట్‌గా ఫోన్ చేసి నైట్‌ ఫ్రీనా అని అడిగేవారంటూ చెప్పింది.

ఓ నిర్మాత అయితే సినిమాల్లో రాణించాలంటే ఇలాంటివి కామనే. నాతో కమిట్మెంట్‌కి ఒప్పుకుంటే మంచి ఆఫర్ ఇస్తా వస్తావా అని అడగడంతో చెప్పుతో కొడతా అని ఫోన్ పెట్టేశా. ఆ తరువాత ఇలాంటి ఫోన్ కాల్స్ చాలానే ఉన్నాయంటూ లైంగిక వేధింపుల్ని బయటపెట్టింది. అయితే ఇలా జరుగుందని బయటకు చెప్పితే పాపులారిటీ కోసం ఇలా చేస్తుందని అంటున్నారని.. ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపుల బారిన పడిన వాళ్లు చాలా మంది ఉన్నారని అయితే గతి లేక శరీరాల్ని లంచంగా అర్పించుకుంటున్నారన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటున్నారు మాధవి. అయితే తనను వేధించిన నిర్మాతల ఎవరో బయటపెడితే ఇండస్ట్రీకి, వాళ్లను నమ్ముకున్న వాళ్లకి నష్టం జరిగే అవకాశం ఉన్నందున వాళ్ల పేర్లు బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదు మాధవి. అయితే సమయం వచ్చినప్పుడు అందరి గుట్టు బయటపడుతుందని అని ఆమె తెలిపారు.

Movie News

hi

Published

on

hi

Continue Reading

Movie News

ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ నిశ్చితార్థం

Published

on

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లడం ఆ తరువాత ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ఆ తరువాత అఖిల్ తన దృష్టిని మూవీస్ పై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం ఆదివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

అనిందిత్ రెడ్డి ఎవరంటే..? అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని పెళ్లిచేసుకోనున్నాడన్నమాట.

దేశ వ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

 

Continue Reading

Movie News

రానాకు మరో బాహుబలి.. భారత్‌లో భారీ స్థాయిలో

Published

on

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. కనీవిని ఎరగని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘బ్లాక్ పాంథర్‌‌’ను దాటేసింది . మన దేశంలోనూ ఈ మూవీ 2000కు పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ మూవీ.. భారత్‌లో ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీగా నిలవనుంది.

ఈ హాలీవుడ్‌ మూవీలో సూపర్‌ హీరోలందరూ యాక్ట్ చేసారు. థానోస్ అనే సూపర్ విలన్ బారి నుంచి డజను మందికిపైగా హీరోలు కలిసి భూమిని కాపాడటమే ఈ మూవీ కథ. విలన్ థావోస్ క్యారక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. భారత మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాగా.. ఈ ఏడాది అంతకు ఒక్క రోజు ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది.

హాలీవుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో హైప్ వచ్చిన రెండో మూవీగా అవేంజర్స్ నిలిచింది. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ మూవీకి మాత్రమే అవేంజర్స్ కంటే ఎక్కువగా హైప్ వచ్చింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీల్లో ఇన్ఫినిటీ వార్‌ విడుదలవుతోంది.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ అమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్లు రాబట్టొచ్చని అంచనా. ఆంటోనీ రూస్సో, జో రూస్సో ఈ మూవీకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జెర్మీ రెన్నెర్, శామ్యూల్ జాక్సన్, విన్ డీజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: