Connect with us

Technology

సింపుల్ ..మీ మొబైల్ ను మీ ఇంట్లో ఉండే మీ ఆధార్ లో లింక్ చేసుకోవచ్చు..!

Published

on

దేశంలో ఉన్న మొబైల్ వినియోగ‌దారులంద‌రూ త‌మ మొబైల్ నంబ‌ర్ల‌ను ఆధార్ నంబర్ల‌తో లింక్ చేసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే అన్ని టెలికాం సంస్థ‌లు ఇప్ప‌టికే ఈ ప్ర‌క్రియ‌ను ప్రారంభించాయి కూడా. అయితే ప్ర‌స్తుతం చాలా మంది ఒక‌టి క‌న్నా ఎక్కువ మొబైల్ నంబ‌ర్లను ఉప‌యోగిస్తున్న నేప‌థ్యంలో అస‌లు ఈ లింక్ ని ఎలా చేసుకోవాలి అనే సందేహాలు చాలా మందికి వ‌స్తున్నాయి. ఇంత‌కీ అస‌లు ఏ మొబైల్ యూజ‌ర్ అయినా ఈ ప్ర‌క్రియ‌ను ఎలా పూర్తి చేయాలి..?

రోజుకు పదిసార్లు మీ మొబైల్‌కి ఒక మెసేజ్ వస్తుంటుంది. అదేంటంటే.. మీ మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయించుకోండి అని. టైమ్ ఇంకా ఉందనో.. స్టోర్‌కి వెళ్లలేకఇన్నాళ్లూ ఆధార్ లింక్ చేయని వాళ్లు చాలా మందే ఉన్నారు. వారి కోసమే ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా స్టోర్ల‌కి వెళ్ల‌కుండానే ఆధార్‌ను లింక్ చేసుకునే అవ‌కాశం క‌లుగుతోంది. 14546 టోల్ ఫ్రీ నెంబ‌ర్‌కి కాల్ చేసి ఇంట‌రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్ట‌మ్ ద్వారా ఆధార్‌ను లింక్ చేయ‌వ‌చ్చు. వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ ద్వారా ఈ లింక్ జ‌రుగుతుంది.

ఆధార్ రీ-వెరిఫికేష‌న్‌లో భాగంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెంబ‌ర్‌కి కాల్ చేయగానే… మీరు భార‌తీయులా కాదా అనే విష‌యాన్ని తెలియ‌జేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత మీ 12 అంకెల ఆధార్ సంఖ్య‌ను ఎంట‌ర్ చేయాలి. వెంట‌నే ఆధార్‌లో న‌మోదు చేసిన మొబైల్ నెంబ‌ర్‌కి ఒక వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ వ‌స్తుంది. అందుకే ఆధార్‌తో న‌మోదు చేయించిన మొబైల్‌ని ద‌గ్గ‌ర పెట్టుకోవాలి. ఓటీపీ క‌న్‌ఫ‌ర్మ్ చేయ‌గానే లింక్ పూర్త‌వుతుంది.

Latest News

Trending

%d bloggers like this: