Connect with us

Uncategorized

రేవంత్ రెడ్డికి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన కేటీర్

Published

on

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ పరోక్షంగా విమర్శలు చేశారు. జైళ్లో చిప్పకూడు తిన్నవారు అవినీతి గురించి మాట్లాడితే స్పందించాల్సిన అవసరం తమకు లేదని కేటీర్ అన్నారు. జనవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోన్న సంగతి తెలిసిందే.

నాటి నుంచి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కోన సాగుతోంది. కేసీఆర్ సర్కార్ కమీషన్ల కోసం ప్రయివేట్ వ్యక్తుల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ విషయమై చర్చకు రావాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తన ఆరోపణలు నిజం కావని తేలితే ముక్కు నేలకు రాయడానికి నేను రెడీ అని చెప్పారు.

రేవంత్ రెడ్డి విమర్శలపై కేటీఆర్ స్పందిస్తూ.. జైళ్లో చిప్పకూడు తిన్నవారి ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై ఆధారాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రేవంత్‌కు సలహా ఇచ్చారు. వ్యవసాయ రంగానికి విజయవంతంగా 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని, దీన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతోందన్నారు. రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి రాలేమన్న భయంతోనే కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

Uncategorized

కమల్ హాసన్: శ్రీదేవి నాకు చెల్లెల్లాంటిది

Published

on

ఆమెతో కలిసి అనేక సూపర్ హిట్ మూవీలో నటించిన హీరో.. వారిద్దరిదీ హీరో,హీరోయిన్లుగా హిట్ పెయిర్. రొమాంటిక్ పెయిర్. సాధారణ జనాలు అందమైన జంటను వర్ణించాలంటే.. వాళ్లిద్దరూ ‘శ్రీదేవి- కమల్’లా ఉన్నారు.. అనే మాటను కూడా అనుకుంటూ ఉండేవారు ఆ రోజుల్లో. అయినప్పటికీ శ్రీదేవితో తనది అన్నాచెల్లెలు అనుబంధమే అంటున్నాడు కమల్ హాసన్. ఇటీవలే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఈ సినీనటుడు ఒక తమిళ పత్రికలో రాసే వీక్లీ కాలమ్ లో శ్రీదేవిని స్మరించాడు.

ఆమె మరణం నేపథ్యంలో తమ అనుబంధం గురించి ప్రస్తావించాడు. శ్రీదేవి, కమల్ ల కాంబినేషన్లో బోలెడన్ని మూవీస్ వచ్చాయి. శ్రీదేవి యుక్తవయసులోకి వచ్చాకా చేసిన మొదటి సినిమాలో కూడా కమల్ నటించాడు. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో రజనీ, కమల్, శ్రీదేవిలు నటించారు. ఆ తర్వాత ఆమె నటించిన సూపర్ హిట్ మూవీ ‘పదహారేళ్ల వయసు’ తమిళ వెర్షన్లో కమల్ ది ప్రధాన క్యారక్టర్.

ఆ తర్వాత వీరి కాంబోలో ‘ఎర్రగులాబీలు’ వంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఇంకా ‘ఆకలిరాజ్యం’, ‘గురు’, ‘ఓ రాధా ఇద్దరు కృష్ణులు’ వంటి మూవీస్ తో సహా.. బోలెడన్ని మూవీస్ లో శ్రీదేవి, కమల్ లు జంటగా కనిపించారు. వీళ్ల కాంబోలోని మూవీ క్లాసిక్స్ గా , కల్ట్ హిట్స్ గా నిలిచాయి. ప్రేయసీ ప్రియులంటే.. శ్రీదేవి, కమల్ లా ఉండాలనే పోలిక కూడా వచ్చింది. ఈ విషయాలన్నింటినీ తన వ్యాసంలో ప్రస్తావించిన కమల్.. శ్రీదేవితో మాత్రం తనది అన్నాచెల్లెలు అనుబంధమే అని చెప్పాడు.

Continue Reading

Uncategorized

రకుల్ ప్రేమలో రానా : జస్ట్ టైం పాస్ అట

Published

on

ప్రభాస్ తర్వాత మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా. ఈ కండల వీరుడు తమిళ కుట్టి త్రిషా‌తో ప్రేమాయణం సాగించినట్లు మొన్నటిదాక వార్తలు వచ్చాయి. అంతేకాదు, వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే, ఇప్పుడు తాజాగా రానా-రకుల్ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. మంచి హిట్లతో టాలీవుడ్‌లో స్థిరపడ్డ ఈ పంజాబీ భామ. సమంత ఆదర్శంగా దగ్గుబాటివారికి దగ్గరవుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇది నిజమేనా అని రకుల్‌ను అడిగితే. తనకు ఉన్న కొద్దిపాటి స్నేహితుల్లో రానా ఒకరని, తమ మధ్య ప్రేమ అంటూ వస్తున్న వార్తలు మాత్రం అబద్దం అని చెప్పింది. రకుల్, సిద్ధార్థ్ మల్హోత్ర జంటగా నటించిన హిందీ చిత్రం ‘అయ్యారీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

ఈ వార్త విని రానా, నేను నవ్వు ఆపుకోలేకపోయాం. అవన్నీ జస్ట్ రూమర్స్. రానా నాకు మంచి స్నేహితుడు. నాకు ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి ముందుంటాడు. ఇంటిగా దూరంగా హైదరాబాదులో ఉంటున్నా. రానాతో కలిపి నాకు ఇక్కడ దాదాపు 15 నుంచి 20 మంది స్నేహితుల గ్యాంగ్ ఉంది. రానా ఇంటి పక్కనే నేను ఉంటున్నా. కాబట్టి సమయం దొరికినప్పుడు టైమ్ పాస్ చేస్తుంటాం. మేం సింగిల్‌గా ఉన్నాం కాబట్టే ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు’’ అని రకుల్ తెలిపింది.

పెళ్లెప్పుడు అని అడిగిన ప్రశ్నకు. ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి పెడుతున్నా అని తెలిపింది. ప్రేమ, పెళ్లి వ్యవహారాలేమైనా ఉంటే తానే స్వయంగా చెబుతానని తెలిపింది. ఒక పెళ్లి చేసుకోవల్సి వస్తే తన వృత్తికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తనను అర్థం చేసుకుంటాడని చెప్పింది.

Continue Reading

Uncategorized

మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారు ఇలా చేస్తే నొప్పులన్నీ మాయం

Published

on

వయసు పై బడ్డ వారిలోనే కాకుండా ఈ మధ్య చిన్న వయసు వారిలో కూడా కీళ్ల నొప్పులు వస్తున్నాయి. కీళ్ళ నొప్పులు ముఖ్యంగా ఆస్టియో ఆర్థ్రైటస్‌, రుమటాయిడ్‌ ఆర్థ్రైటస్‌, గౌట్‌, సోరియాటిక్‌ ఆర్థ్రైటస్‌ అని ఎక్కువగా చూస్తుంటాము. ఆస్టియో ఆర్థ్రైటస్‌ ఇవి ఎక్కువ 30 సంవత్సరాల వయసుపై బడ్డ వారిలో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా పెద్ద కీళ్ళలో, మోకాళ్ళలో కనిపిస్తాయి. ఇది సైనోవియల్‌ ఫ్లూయడ్‌ తగ్గడం, కార్టిలేడ్‌ అరిగిపోవడం వల్ల, కాల్షియం, డి విటమిన్‌ తగ్గడం వలన వస్తుంది. దీనివల్ల కూర్చుని లేవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా నొప్పిగా ఉంటుంది.

ఇక చలికాలం లో చలికి ముడుచుకొని రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కీళ్ళవాతం చేస్తుంది. ఇలాంటప్పుడు కీళ్లు కదిలేటటువంటి వ్యాయామాలు చేయడం మంచింది. శరీరంలో బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీని వలన జాయంట్స్ దెబ్బతింటాయి. ఒకసారి జాయంట్ పెయిన్స్ వస్తే తిరిగి కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. ఈ వ్యాధి వచ్చినవారు చాలా టైడ్ అవుతారు. ఉదయంపూట జాయంట్స్ లో భరించరాని నొప్పి వస్తుంది.

స్టార్టింగ్ లోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకొవడం మంచిది. నీరసం, బడలిక, రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు, జీవన మార్పులు చేయడం ద్వారా కీళ్లనొప్పుల నుండి ఉపశమనం పొందొచ్చు. కీళ్లు, మోకాళ్ల నొప్పులున్నవారు అర్టిఫిషల్ షుగర్స్, డైరీ ప్రొడక్ట్స్ కార్న్ ఆయిల్స్ గుడ్డు వంటి పదార్థాలని తీసుకోకపోవడం మంచిది. ఫైనాపిల్ మన శరీరంలోని గాయాలను, నొప్పులను తగ్గిస్తుంది. ఆరంజ్ లో ఉన్న సీ విటమిన్ కీళ్ళనొప్పుల నివారణలో బాగా సహకరిస్తుంది. కొన్ని చిట్కాల ద్వారా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందొచ్చు.

కోడిగుడ్డు తెల్లసొనలో కొద్దిగా కలబండ గుజ్జుని కలిపి ఈ మిశ్రమాన్ని నొప్పులున్నచోట రాయాలి. ఇలా చేయడం వలన నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. అలాగే గోరువెచ్చని పాలలో కొద్దిగా ఆముదం కలుపుకుని తాగడం వలన కీళ్లనొప్పులు, వాపులు తగ్గుతాయి. ఒక బంగాళాదుంపను ముక్కలుగా కోసి బౌల్ లో వేసి నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే ఆ నీటిని వడపోసుకొని పరగడుపున తాగడం వలన మొకాళ్ళ నొప్పులు దూరమవుతాయి.

కీళ్ళ వాతం తగ్గాలంటే నువ్వుల నూనె, నిమ్మరసం సమభాగంగా కలిపి రోజూ కీళ్ళ పై మర్దన చేసుకోవాలి. విటమిన్ సి కి సంబంధించిన జామపండు, కమలాపండు తీసుకుంటే కీళ్ళకు ఉపశమనం కలుగుతుంది. ఉప్పు కలిపిన నీటిలో చింతాకు ఉడికించి నొప్పులున్న చోట ఆ నీటిని రాసుకోవాలి. క్యారెట్ జ్యూస్ ,క్యాబేజ్ సూప్ తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

ఒక గ్లాస్ పాలలో అర స్పూన్ పసుపు వేసుకోవాని తాగాలి. ఇది మోకాళ్ల నొప్పులను నివారిస్తుంది. పాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మెంతులను రాత్రంతా నీళ్ళలో నాన బెట్టి ,ఉదయం వాటిని నమిలి తినాలి. మెంతులను ముద్దగా చేసుకొని కీళ్ళనొప్పులు ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. రోజు ఉదయం వ్యాయామం చేయడం వల్ల కీళ్ళ నొప్పుల నుండి విముక్తి పొందవచ్చు.

నువ్వుల నూనెలో వెల్లుల్లి పాయలు వేయించి, పరగడుపున 2లేక3 తింటే కీళ్ళ నొప్పులు తగ్గు తాయి. వేడి నీటి తో కాపడం పెట్టుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: