Connect with us

Movie News

అచ్చం మహానటిలా.. కీర్తి సురేష్ అదరగొట్టిందే!

Published

on

నాగ్‌ అశ్విన్‌ డైరేక్షన్ లో మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘మహానటి’. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌ ఈ మూవీను నిర్మిస్తున్నారు. ఇందులో సావిత్రి క్యారక్టర్ లో కీర్తి సురేశ్‌ యాక్ట్ చేస్తుంది. ఆమె భర్త జెమిని గణేశన్‌గా దుల్కర్‌ సల్మాన్‌ అలరించనున్నాడు. ఈ మూవీ బృందం ఇటేవలే విడుదల చేసిన ‘మూగ మనసులు’ అనే పాట అభిమానులను ఆకట్టుకుంది. రీసెంట్ గా మూవీలోని కీర్తి సురేశ్‌‌కు సంబంధించిన మరో రెండు ఫొటోలను విడుదల చేశారు.

‘మహానటి’గా ఒదిగిపోయిన కీర్తి సురేశ్ ఫొటో కళ్లు తిప్పనీయకుండా ఉంది. దుల్కర్‌‌తో జంటగా ఉన్న మరో ఫొటో కూడా అలనాటి పాతతరాన్ని గుర్తు చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ స్టిల్స్‌లో కీర్తి సురేశ్‌ అందాల జాబిలమ్మలా ఉంది. ట్విటర్‌లో వీటికి అదే స్థాయిలో ప్రశంసలు కూడా వస్తున్నాయి.

 

కీర్తి సురేశ్‌ చాలా బావుందంటూ సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా కీర్తిని కొనియాడాడు. ‘మహానటి.. ఇది నిజంగా అద్భుతమైన ఫొటో.. ఈ మూవీ కచ్చితంగా అప్పటి కాలానికి తీసుకెళ్తుంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఆ కామెంట్లకు కీర్తి కూడా ధన్యవాదాలు చెప్పింది. దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ఉన్న ఫొటో తనకు చాలా ఇష్టమైందని చెప్పుకొచ్చింది.

Latest News

Trending

%d bloggers like this: