Connect with us

Movie News

కత్తి మహేష్ చెప్పిన తాంత్రిక పూజలు పూజలు ఇవేనా

Published

on

పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కలిసి తాంత్రిక పూజలు చేశారంటూ సినీ విమర్శకుడు కత్తి మహేష్ చెప్పిన విషయాలు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారాయి. మహేష్ ఎప్పుడైతే ఈ విషయాలను చెప్పాడో. అప్పటి నుంచి ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే ఇందుకు సంబంధించి ఏబీఎన్ సమాచారం సేకరించింది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎస్. జగన్నాథపురం లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసినట్లు తేలింది.

అయితే ఆ పూజలు, తాంత్రిక పూజలు కాదంటున్నారు స్థానికులు, పండితులు. లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఏటా మహా సంపుటిత, శ్రీ జ్వాల నరసింహస్వామి సుదర్శన మహాయజ్ఞం చేస్తారు. మహాశివరాత్రి ముందురోజు, మహాశివరాత్రి రోజున ఈ యజ్ఞాన్ని ప్రతి సవత్సరం జరిపిస్తారు.

ఎస్. జగన్నాథపురం లక్ష్మి నరసింహస్వామి ఆలయంపై త్రివిక్రమ్‌కు నమ్మకం ఎక్కువ. అందుకే టైమ్ దొరికినప్పడు ఈ ఆలయంలో జరిగే మహాయజ్ఞానికి వాస్తు ఉంటారు. ఆ సమయంలో తాను రూపొందిస్తున్న సినిమా యూనిట్‌లోని ముఖ్యులను కూడా త్రివిక్రమ్ యజ్ఞానికి ఆహ్వానిస్తారు. పవన్‌కల్యాణ్‌ను కూడా ‘జల్సా’ సినిమా తీస్తున్న సమయంలో త్రివిక్రమ్ ఇక్కడికి తీసుకువచ్చారు. పవన్, త్రివిక్రమ్ కలిసి తాంత్రిక పూజలు చేశారన్నది కత్తి చేసిన ఆరోపణ.

‘జల్సా’ సినిమా విడుదల సమయంలో పవన్ ఇక్కడికి వచ్చిన మాట నిజమేనని, అయితే వారు చేసింది మహాయజ్ఞమేనని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. విశ్వశాంతి కోసం ఈ మహాయజ్ఞాన్ని చేస్తారు. 2009లో పవన్, త్రివిక్రమ్ ఈ యజ్ఞంలో పాల్గొని పూజలు చేశారు. ఆ తర్వాత పవన్ రాలేదు. అయితే త్రివిక్రమ్ మాత్రం 2014 వరకు వరుసగా ఇక్కడి వచ్చి మహాయజ్ఞంలో పాల్గొని పూజలు చేశారు. 2014లో త్రివిక్రమ్‌‌తో పాటు హీరో సునీల్ కూడా వచ్చి ఈ పూజల్లో పాల్గొన్నారు.

Latest News

Trending

%d bloggers like this: